Tuesday, April 30, 2024
- Advertisement -

మళ్లీ పెళ్లి చేయమని కోరుతున్న కేసీఆర్

- Advertisement -

తనదైన శైలిలో ప్రత్యర్ధులపై ఘాటైన వ్యాఖ్యలు చేసి, హీటు పుట్టించే సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మరోసారి తనదైన శైలిలో ఘాటు విమర్శలే చేశారు. గతంలో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, సహా పలువురు నేతలపై వివిధ సందర్భాల్లో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నారాయణ ఈ సారి కేసీఆర్ పై బీభత్సమైన సెటైర్ వేసేశారు. కేసీఆర్‌ తీరు చూస్తుంటే శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లి కొడుకు మాదిరిగా ఉందని నారాయణ ఎద్దేవా చేశారు. ఇప్పుడు తనకు మళ్లీ పెళ్లి చేయండి..సత్తా చాటుతా, దుమ్ము దులుపుతా, పొడిచేస్తా, చించేస్తా.. అన్నట్లు ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా 9 నెలల కాలం పరిపాలనకు అవకాశం ఉండగా, ఏం తొందరని ఇప్పుడే ఎన్నికల కోసం ముందస్తుకు రెడీ అయ్యారని నిలదీశారు. పైగా ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికలు జరిగే సమయం గురించి కూడా కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ పూర్తిగా లక్ష్మణరేఖ దాటేశారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యవహారశైలి, ఎన్నికల జరిగే సమయం గురించి చెప్పడంపై ఈసీ ప్రధానాధికారి కూడా విచారం వ్యక్తం చేశారని నారాయణ తెలిపారు.

మరోవైపు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రత్యర్ధులను, రాజకీయాల్లో అనుభవజ్ఞులను దద్దమ్మలు, సన్నాసులు, పనికిమాలినోళ్లు అని నోరు పారేసుకుంటూ, నీచంగా మాట్లాడే కేసీఆర్ కుసంస్కారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నారాయణతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ముందస్తు ఉత్సాహం త్వరలోనే నీరుగారిపోతుందని ఎద్దేవా చేశారు. అసలు ‘ఎన్నికల కమిషన్‌ను నిర్దేశించేలా, ప్రభావితం చేసేలా, కేసీఆర్‌ ప్రకటనలు చేయడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికల షెడ్యూల్‌ని కేసీఆర్‌ ప్రకటించడమేంటని సురవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేలా కేసీఆర్ వ్యవహారశైలి ఉందని మండిపడ్డారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల తేదీలను కేసీఆర్‌ ప్రకటించడంపై తాము ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారని సురవరం సహా సీపీఐ నేతలు మీడియాకు తెలిపారు. కేసీఆర్‌ది ముమ్మాటికీ కుటుంబ క్యాబినేట్‌, అని పార్టీ పొలిట్ బ్యూరోతో చర్చ లేకుండా, కుటుంబీకులు మాట్లాడుకుని, కేవలం రెండు నిమిషాల్లో అసెంబ్లీకి రద్దు చేస్తూ క్యాబినేట్‌ తీర్మానం చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ ఏక వ్యక్తి పార్టీ అని ఆ సంఘటనే నిరూపించిందన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరోతో సంబంధం లేకుండా, కనీసపు చర్చ జరపుకుండా 105 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేశారంటే కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలని సురవరం ప్రశ్నించారు. ఇలాంటి నియంతల పాలనకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని సీపీఐ నేతలు విజ్ఞప్తి చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -