Friday, March 29, 2024
- Advertisement -

ఏంటీ ఈ కోతలు.. కేంద్రంపై ఎర్ర‌బెల్లి ఫైర్ !

- Advertisement -

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపులకు సంబంధించిన విష‌య‌మై తెలంగాణ మంత్రులు కేంద్ర స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవ‌లే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో కేంద్ర తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా రాష్ట్ర మ‌రో మంత్రి కేంద్ర తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ కేంద్ర తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించకపోగా… గతంలో ఇచ్చిన వాటిలోనే 500 కోట్లు కోత పెట్టడం ఏమిటంటూ ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికిచ్చే నిధులను ఇవ్వకపోతే తాము గ్రామ పంచాయ‌తీలకు ఏం సమాధానం చెప్పుకోవాలంటూ ప్ర‌శ్నించారు.

అభివృద్ధిలో ప్ర‌గ‌తిప‌థంలో దూసుకుపోతున్న తెలంగాణ‌కు ఒక వైపు అవార్డులు ఇస్తూనే మ‌రో వైపు నిధుల్లో కోత‌లు విధిస్తూ అభివృద్ధికి ఆటంకం క‌లిగించ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజసమని ఎర్ర‌బెల్లి ప్రశ్నించారు. గత బడ్జెట్‌లో 1,845 కోట్లు కేటాయిస్తే… మిగతా అయిదు వందల కోట్ల మాటేమిటని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను వెంట‌నే ఇవ్వాల‌ని పేర్కొన్నారు.

ఏప్రిల్‏లో సినీ ప్రియులకు పండగే.. !

కార్తీ ‘ఖైదీ’ సీక్వెల్ రాబోతోంది !

మీ దంతాలు పసుపురంగులో ఉంటే.. ఈ చిట్కాలు మీ కోసం !

‘వీరయ్య’గా.. చిరు విశ్వరూపం !

సాగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థి ఆయనే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -