Tuesday, April 30, 2024
- Advertisement -

టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ మాజీ స్పీక‌ర్‌..

- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. ముందుస్తు ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఒకే సారి 105 మంది స‌భ్యుల‌ను ప్ర‌క‌టించి సంచ‌ల‌న‌నానికి తెర‌లేపారు. అలాగే మిగతా పార్టీల్లో ఉన్న కీలక నేతలను కూడా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్రవారం ఉదయం సురేశ్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌ తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఇందుకు ఆయన అంగీకరిస్తే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ ఆఫర్ కు సురేశ్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

సురేష్‌రెడ్డి మాట్టాడుతూ తెలంగాణా అభివృద్ధి పదంలో న‌డ‌వాలంటే మ‌రో సారి తెరాసా ప్ర‌భుత్వం అధికారంలోకి రావాల‌న్నారు. రాజ‌కీయ ల‌బ్ధికోసం పార్టీలో చేర‌డంలేద‌ని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 2004లో సురేశ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2004 నుంచి 2009 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

1984లో మండల స్థాయి నేతగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సురేశ్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. అనంతరం 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. అయితే, 2009లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

తాజాగా నిజామాబాద్ లో డీఎస్ వ్యవహారం తలనొప్పిగా మారిన నేపథ్యంలో సురేశ్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా విజయావకాశాలను మెరుగుపర్చుకోవచ్చని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది. కేవలం సురేశ్ రెడ్డి మాత్రమే కాకుండా మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్ కి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -