Friday, March 29, 2024
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..!

- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపట్నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు ఎస్​ఈసీ పార్ఠసారథి తెలిపారు. డిసెంబరు 1న జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 4న జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నట్లు వివరించారు.

1.జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: ఎస్టీ-2(జనరల్‌ 1, మహిళ1)
2.జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: ఎస్సీ-10‍‌(జనరల్‌ 5, మహిళలు 5).
3.జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: బీసీ-50(జనరల్‌ 25, మహిళలు 25).
4.జీహెచ్ఎంసీ వార్డు రిజర్వేషన్లు: జనరల్ మహిళ-44, జనరల్-44.

పోలింగ్​ కేంద్రాలు…
1.గ్రేటర్ పరిధిలో 1,439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.
2.గ్రేటర్‌లో 1,004 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.
3.గ్రేటర్‌లో 257 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించారు.

ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్న అధికారులు… 21న నామినేషన్ల పరిశీలించనున్నారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చారు. డిసెంబర్ 1న ఉదయం 7 నుంచి 6 గంటల వరకు పోలింగ్​ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న అవసరమైన కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.

మూడో దశకు భారత్​ బయోటెక్ టీకా..!

మళ్లీ అక్కడ కరోనా డేంజర్ బెల్!

ఓరి ద్యావుడా.. పావురం ధర రూ. 14కోట్లు.. ఇంతకీ స్పెషల్ ఏమిటి..?

డీఆర్​డీఓ మరో భారీ ప్లాన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -