Monday, April 29, 2024
- Advertisement -

హిమాచ‌ల్‌లో కాంగ్రెస్ ఓట‌మికి కార‌ణాలు

- Advertisement -

హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ మట్టికరిచింది. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ను చేజిక్కించుకుంది. 68 స్ధానాలు కలిగిన హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ దాదాపు 40 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్‌ కేవలం 22 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.

-ముఖ్య‌మంత్రి వీరభద్రసింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత బీజేపీ విజ‌యానికి కలిసివచ్చింది.
– పైగా రాష్ట్రంలో అవినీతి పెచ్చు పెరిగిపోయింద‌ని ప్ర‌జ‌లు అస‌హ‌నంతో ఉన్నారు.
– కాంగ్రెస్ ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డింద‌ని ఎన్నిక‌ల ప్రచార సభల్లో బీజేపీ నాయ‌కుల ప్ర‌ధాన అస్త్రంగా చేసుకొని ప్ర‌చారం చేశారు.
– పేదలకు ఉద్దేశించిన రూ.57,000 కోట్లను వీరభద్రసింగ్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి.
– సీబీఐ కేసులు, ఈడీ విచార‌ణ‌ను హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి విచార‌ణ ఎదుర్కొంటున్నారు. దీన్నే బీజేపీ ప్ర‌ధాన ఆయుధంగా చేసుకుంది.
– ఇక ఈశాన్య రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌ర‌చూ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌స్తూ పోతున్నారు. దీపావ‌ళి వేడుక‌ల‌కు ఈ రాష్ట్ర స‌రిహ‌ద్దులో జ‌రుపుకున్నారు.
– మాజీ సీఎం ప్రేమ్‌కుమార్‌ ధుమల్‌ను బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లింది.
– ధుమల్ గ‌తంలో బీజేపీ నేతృత్వంలో రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. 1998-2003, తిరిగి 2008-2012 వరకూ రెండుసార్లు హిమాచల్ ప్ర‌దేశ్ సీఎంగా ప‌ని చేశారు.
– ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్ర‌దేశ్ ఎన్నికల్లో బీజేపీ ప్ర‌ధాన ప్ర‌చార క‌ర్త‌గా పాల్గొన్నారు.
– అయితే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఒక పార్టీ అధికారం చేజిక్కుంచుకున్న త‌ర్వాత మ‌రో పార్టీ రావ‌డం సాధార‌ణ‌మే. 1998లో బీజేపీ, 2003లో కాంగ్రెస్‌, 2008లో బీజేపీ, 2012లో కాంగ్రెస్ పార్టీలు అధికారం అనుభ‌వించాయి. ఇప్పుడు 2017లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -