Monday, April 29, 2024
- Advertisement -

బాబుగారి కోడ్ భాష..టన్ను అంటే ఎంతో తెలుసా?

- Advertisement -

ఎన్నికల వేళ ఏ టైంలో ఐటీ నోటీసులు వచ్చాయో కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. చంద్రబాబు ఐటీ నోటీసులకు సంబంధించి రోజుకో వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఐటీ నోటీసులను ధీటుగా ఎదుర్కొంటానని చంద్రబాబు చెబుతున్న చంద్రబాబు అక్రమాలకు పాల్పడింది వందల కోట్లలో అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో రూ. 118 కోట్లు ఉండగా ఇది వందల కోట్లు ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి.

ఇక ఐటీ నోటీసుల్లో చంద్రబాబు ఎలా డబ్బులు స్వాహా చేశారో రికార్డు స్టేట్‌మెంట్‌ని నమోదుచేసి దానిని ఆయనకు ఇచ్చిన నోటీసుల్లో స్పష్టంగా వెల్లడించారు. ఇక చంద్రబాబుకు బినామీ కంపెనీల నుండి వచ్చిన డబ్బు మొత్తం ఓ కోడ్ భాష నేపథ్యంలో సాగింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలోనే వైరల్‌గా మారింది.

డబ్బులు చేతులు మారడం ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా కోడ్ భాషను వినియోగించారని ఐటీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. డబ్బు ఏ ప్రాంతానికి వెళ్లాలి..ఎంత వెళ్లాలి అంతా కోడ్ భాషలోనే జరిగింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్‌ని ఐటీ అధికారులు గుర్తించారట. బెంగళూరు వారికి డబ్బులు చేరాలంటే బాంగ్ అని, హైదరాబాద్‌కు చేరాలండా హెఐడీ అని,విజయవాడలోని తన దగ్గరివారికి చేరాలంటే విజయ్‌ అని కోడ్ భాష సంభాషణ జరిగింది. ఎక్కడా డబ్బు, క్యాష్ అనే పదం రాకుండా జాగ్రత్తపడ్డారు బాబు.

ఇక డబ్బుకి పెట్టిన కోడ్ నేం స్టీల్. అలాగే టన్నుల్లో అంటే కోటి. ఇదంతా మనోజ్ వాసుదేవ్ పార్థసానికి, చంద్రబాబు పీఏకు మధ్య నడిచిన చాట్ సంభాషణ ఆధారంగా గుర్తించారు. ఐటీ నోటీసుల్లో రోజుకో వ్యవహారం వెలుగుచూస్తుండటం టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. రానున్న రోజుల్లో ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏడు పదుల వయస్సులో చంద్రబాబు పరిస్థితి ఏంటా అన్నది ప్రశ్నార్థకంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -