Friday, May 3, 2024
- Advertisement -

దుబ్బాక లో బీజేపీ గెలవడం కష్టమేనా..?

- Advertisement -

తెలంగాణాలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. దుబ్బాక లో ఉప ఎన్నికక కోసం ఇప్పటికే అన్ని పార్టీ లు కసరత్తులు మొదలుపెట్టగా ఎలక్షన్స్ కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు ప్రజలు..  అధికార పార్టీ ఎమ్మెల్యే మరణించడంతో దుబ్బాక లో ఉపఎన్నిక లాంచనం అయ్యింది… ఇప్పటికే ఆ ప్రాంతం పై అన్ని పార్టీ లు గెలుపుకోసం కసరత్తులు మొదలుపెట్టగా అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్  ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది.

రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలోకి  దింపుతుండగా  బీజేపీ కి ఈ విషయంలో ఆదిలోనే హంసపాదు అన్నట్లు బీజేపీ లీడర్ పై ఉన్న రేప్ కేసు ఇప్పుడు బయటకు రావడం చర్చనీయాంశమైంది.. ఉప ఎన్నిక‌ల పోరులో విజ‌యం కో్సం విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ అభ్యర్థిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల ముందు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే తన అనుచరులు 40 లక్షల రూపాయలతో పోలీసులకు చిక్క‌డం వివాదాస్ప‌ద‌మైంది. తాజాగా ఈ రేప్ కేసు బీజేపీ దుబ్బాక లో గెలవడాన్నికి అవకాశాలు తగ్గేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రఘునందన్ రావుపై తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిబ్ర‌వ‌రిలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మెదక్ జిల్లాకు చెందిన ఆమె తన భర్తతో విభేదాల కారణంగా స్థానిక పోలీసు స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ రఘునందన్ సలహా మేరకు తన భర్తపై మెయింటెనెన్స్ కేసు ఫైల్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు నిమిత్తం 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి తన వద్ద అశ్లీల చిత్రాలు ఉన్నాయని, ఎవరికైనా చెబితే వాటిని సోషల్ మీడియాలో పెడుతానంటూ గ‌తంలోనే ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.మరి బీజేపీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

జంపింగ్ జపాంగ్‌లను పక్కన పెట్టిన బాబు..!

జగన్ ఢిల్లీ టూర్ వెనుక ఇంత పెద్ద స్టాటజీ ఉందా..?

జగన్ బీజేపీ పై ఎప్పుడు వత్తిడి తెస్తారో..?

ఏలూరి కి పెద్ద టాస్క్.. టీడీపీ ని బలపరిచేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -