Monday, April 29, 2024
- Advertisement -

ఆ పార్టీల‌తో త‌ప్ప ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోమ్‌….క్లారిటీ ఇచ్చిన‌ జ‌న‌సేన

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం పొత్తుల రాజ‌కీయం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత‌ల‌తో సంబంధం లేకుండా పొత్తుల‌పై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త కొద్దిరోజులుగా జ‌న‌సేన వైసీపీ తో క‌లుస్తుందా లేకా టీడీపీతో క‌లుస్తుందా అని హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. జనసేనతో టీడీపీ కలిస్తే జగన్‌కు నొప్పేంటన్న చంద్రబాబు వ్యాఖ్యలు..ఏపీ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో జనసేన దారిపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు జ‌న‌సేన క్లారిటీ ఇచ్చింది.

పొత్తు ఊహాగానాల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తెర‌దించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేస్తుంద‌ని ట్విట్ట‌ర్‌లో తెలిపారు. వామపక్ష పార్టీలతో తప్ప మరే ఇతర పార్టీతో కలసి వెళ్లమని తెలిపింది. ఎన్నికలలో యువత, మహిళకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. పొత్తులపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మాటలను నమ్మవద్దని పార్టీ శ్రేణులకు సూచింది. ఈ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరింది.

బాబు చేసిన వ్యాఖ్య‌ల‌తో టీడీపీతో, జనసేన చేతులు కలపబోతోందా అనే అనుమానాలు కూడా పలువురిలో కలిగాయి. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ… జనసేన తమ భవిష్యత్ కార్యాచరణ గురించి నేడు క్లారిటీ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -