Monday, April 29, 2024
- Advertisement -

లోకేష్ అవినీతిపరుడు….. చంద్రబాబు నిప్పు అంటావా ఏంటి పవనూ?

- Advertisement -

చంద్రబాబు సావాస ప్రభావమో ఏమో కానీ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా బాగా ముదిరిపోయాడు. మాటలకు చేతలకు అస్సలు పొంతన ఉండడం లేదు. చంద్రబాబుకు కూడా తనను తాను సమర్థించుకోవడం ఎలాగో చేతకాక ముప్పుతిప్పలుపడిన ఓటుకు నోటు కేసులో కూడా అత్యంత దొంగ తెలివితేటలతో బాబుని సమర్థించేశాడు పవన్. ఇక నిన్న ఆవిర్భావ సభలో కూడా టిడిపి నేతల అవినీతి, ఆంధ్రప్రదేశ్ మొత్తం అవినీతి, నారా లోకేష్ అవినీతి అంటూ రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్……తీరా చంద్రబాబు దగ్గరకు వచ్చేసరికి మాత్రం…….ఈ అవినీతి వ్యవహారాలన్నీ చంద్రబాబుకు తెలుసనే అనుకుంటున్నాను. లోకేష్ అవినీతి చంద్రబాబుకు తెలియదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ అయింది.

అలాగే 2019లో మీకు ఎందుకు మద్దతు ఇవ్వాలి అని ఘనంగా ప్రశ్నించాడు కానీ మద్దతివ్వను అని మాత్రం ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. 2014ఎన్నికల్లో పవన్ మద్దతిచ్చిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేశాడన్నది నిన్న పవన్ వ్యక్తపరిచిన భావం. మరి చంద్రబాబు పాలనపై అంత నీచమైన అభిప్రాయం ఉన్నవాడు అయితే 2019లో టిడిపికి మద్దతిచ్చే ఛాన్సేలేదు అని స్పష్టంగా ఎందుకు చెప్పలేదు?

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిజెపి, టిడిపి అంటే పీకల వరకూ కోపం ఉంది అన్న మాట వాస్తవం. తనపై ఉన్న కోపాన్ని కూడా బిజెపిపైకి నెట్టేసి….ప్రజల నుంచి తాను మాత్రం సానుభూతి కొట్టేయాలని చూస్తున్నాడు చంద్రబాబు. అందుకే తన పాపాలను దాచిపెట్టుకుంటూ కన్నీటీ నాటకాలకు తెరలేపాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు. టిడిపిపై ప్రజలకు ఉన్న కోపం ఎఫెక్ట్ తనపై పడుతుందేమో అన్న భయంతో టిడిపిని తిడుతూ తనపైన మాత్రం సానుభూతి వచ్చేలా చేసుకుంటున్నాడు. కానీ ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా వస్తాయో అని చెప్పి అందరూ కూడా పొత్తుల ఆప్షన్‌ని ఓపెన్‌గానే ఉంచుకుంటూ జాగ్రత్తగా ప్రత్యర్థులను విమర్శిస్తున్నారు. అందుకే పవన్ కూడా చంద్రబాబునాయుడు అవినీతి పరుడు అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. అలాగే 2019లో చంద్రబాబుకు మద్దతివ్వను అని కూడా అనలేదు. కానీ చంద్రబాబు, పవన్‌లిద్దరూ కూడా జగన్‌కి నష్టం చేయడానికి మాత్రం రాజకీయ డ్రామాలు బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నారు. పచ్చ మీడియా ఇతోధికంగా ఘనమైన సాయం చేస్తోంది. 2019లో కూడా ఈ రాజకీయ డ్రామాలన్నీ రక్తి కట్టి మరోసారి బాబు అధికారంలోకి వస్తాడా? ఎన్నికలకు ముందైనా, తర్వాతైనా పవన్ మద్దతు మాత్రం చంద్రబాబుకే అన్నది నిజం. మరి ఈ ఇరువురి నాటకాలకే ప్రజలు మరోసారి పట్టం కడతారా? లేక పార్టీ స్థాపించిన మరుక్షణం నుంచీ ప్రజల మధ్యలోనే ఉంటూ ……2014 నుంచీ కూడా ప్రజల కోసమే నిజాయితీగా పోరాడుతున్న జగన్‌కి పట్టం కడతారా? ఎన్నికల ఏడాదిలో చంద్రబాబు, పవన్‌లిద్దరూ కూడా జగన్ నాలుగేళ్ళుగా మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నారు. అంటే నాలుగేళ్ళుగా జగన్ చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉన్నట్టే కదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -