Wednesday, May 8, 2024
- Advertisement -

బీజేపీ రాష్ట్ర అడ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ నియామకం

- Advertisement -

దక్షిణాది రాష్ట్రాల్లో పుంజుకోవాలని బీజేపీ ప్రణాలికలు రచిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. పార్టీ విస్త‌రించ‌క‌పోవ‌డానికి కార‌ణం వెంక‌య్య‌నాయుడ‌నే అని ఆయ‌న్ను ఉప‌రాష్ట్ర‌ప‌తిగా పంపింది. అక్క‌డ‌నుంచి రాజ‌కీయాలు మారిపోయాయి. భాజాపా, టీడీపీ బంధం తెగిపోవ‌డంతో ఇక ఏపీలో సొంతంగా ఎద‌గాని పావులు క‌దుపుతున్న భాజాపా అటువైపుగా అడుగులు వేస్తోంది.

గ‌త కొన్ని రోజులుగా ఏపీ భాజాపా అధ్య‌క్ష ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశారు. అధ్య‌క్ష‌ప‌ద‌వికి హ‌రిబాబు రాజీనామా చేసిన త‌ర్వాత ఎవ‌రు అధ్య‌క్షుడు అనే వాద‌న‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు దానికి పుల్‌స్టాస్ పెట్టింది భాజాపా అధిష్టానం. అధ్య‌క్ష‌రేసులో ప్రధానంగా సోమువీర్రాజు పేరు వినిపించింది.

అయితే ఇప్పుడు తాజాగా భాజాపా అధిష్టానం ఏపీ అధ్య‌క్షుడిగా క‌న్నాల‌క్ష్మినారాయ‌ణ‌ను నిమ‌యిస్తూ అధికారి కంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. సోము వీర్రాజును భాజాపా అధ్య‌క్షుడిగా నియ‌మిస్తార‌నే వార్త‌ల నేప‌థ్యంలో మ‌న‌స్థాపానికి గురైన క‌న్నా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో మేలుకున్న భాజాపా అధిష్టానం క‌న్నాను అధ్య‌క్షుడిగా ఎన్నిక‌ల క‌న్వీన‌ర్‌గా సోము వీర్రాజును నియ‌మిస్తూ అధికారికి ఉత్త‌ర్వులు జారీచేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -