Tuesday, May 7, 2024
- Advertisement -

ఈనెల 18న వైసీపీలో చేర‌నున్న కాట‌సాని..

- Advertisement -

కర్నూలు జిల్లాలో భాజాపాకు చెందిన సీనిర్‌నేత కాట‌సాని రామ్‌భూపాల్ రెడ్డి వైసీపీలో చేర‌డం దాదాపు ఖాయం అయ్యింద‌నే చెప్పాలి. ప్రస్తుతం బిజెపిలో ఉన్న కాటసాని త్వరలో వైసిపిలో చేరటానికి దాదాపు రంగం సిద్ధమైందని సమాచారం.

పాణ్యం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయ‌కుడు కాట‌సాని రాం భూపాల్ రెడ్డి రాజ‌కీయంగా మ‌రో నిర్ణ‌యం తీసుకోనున్నారు.. ఈ నెల 18న కర్నూలులో కార్యకర్తలతో ఆయ‌న సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు… ఇక ఆయ‌న బీజేపీని వీడాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటు ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌క‌పోవ‌డం అలాగే బీజేపీలో కొన‌సాగితే రాజ‌కీయ భ‌విత‌వ్యం ఏమిటి అని ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది.

అదే నిజం అయితే కాట‌సాని వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఎంపిగా పోటీ చేసే అవకాశాలున్నాయ్. ప్రస్తుతం బిజెపిలో ఉన్న కాటసాని త్వరలో వైసిపిలో చేరటానికి దాదాపు రంగం సిద్ధమైందని సమాచారం. కాటసానిని వైసిపిలోకి చేర్చుకోవటానికి పార్టీలోని నేతలకు కూడా ఎటువంటి అభ్యంతరాలు తెల‌ప‌ట్లేదు. కాకపోతే కాటసానిని ఎక్కడ పోటీ చేస్తార‌నేది సస్పెన్స్‌గా మారింది . వైసిపి వర్గాల ప్రకారమైతే మొదటి అవకాశమైతే పాణ్యం అసెంబ్లీకే.

ప్ర‌స్తుతం వైసిపి పాణ్యం ఎంఎల్ఏగా గౌరు చరితారెడ్డి ఉన్నారు. పోయిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా చరిత పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్ధిగా ఓడిపోయిన కాటసానికి సుమారు 60 వేల ఓట్లొచ్చాయి. నియోజకవర్గంపై కాటసానికున్న పట్టేంటో ఆయనకు వచ్చిన ఓట్లే చెబుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఏనిర్ణ‌యం తీసుకుంటార‌నేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -