Monday, April 29, 2024
- Advertisement -

కంచుకోటలో మరింత బలం…….. వైకాపాలోకి కోట్ల కుటుంబం

- Advertisement -

2014 ఎన్నికల్లో కంచుకోటగా నిలిచిన కర్నూలు జిల్లాలో ఈ సారి అంతకుమించిన బలంతో వైకాపా పోటీ పడడం ఖాయం అయింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతులున్న కోట్ల కుటుంబం వైకాపాలో చేరింది. స్వయంగా ఈ విషయాన్ని కోట్ల కుటుంబ సభ్యులే వెల్లడించారు. 2014 ఎన్నికల తర్వాత వైకాపా తరపున గెలిచిన ఎస్పీవై రెడ్డి, భూమా కుటుంబాల నాయకులను టిడిపిలో చేర్చుకున్నాడు చంద్రబాబు. ఆ రకంగా వైకాపాని దెబ్బకొట్టాననుకున్నాడు. అయితే ఇప్పుడు జగన్ మాత్రం అంతకుమించిన బలంతో 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైకాపా క్లీన్ స్వీప్ అనే ఫలితం వచ్చేలా వ్యూహరచన చేస్తున్నాడు.

అందుకు తగ్గట్టుగానే వైకాపాకు కర్నూలు జిల్లాలోనే ప్రముఖ రాజీకయ కుటుంబం అయిన కోట్ల విజయభాస్కరరెడ్డి కుటుంబం తాజాగా వైకాపాలో చేరాలని నిర్ణయించుకుంది. కోట్ల విజభాస్కరరెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి 2019 ఎన్నికల్లో పోటీ చేసే ఉద్ధేశ్యం లేదు. అందుకే ఆయన సోదరుడు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. కోట్ల కుటుంబం తరపున బరిలో దిగనున్న హర్షవర్థన్‌రెడ్డికి కోట్ల కుటుంబం మొత్తం అండగా ప్రచారం చేయనుంది. తాజాగా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి కోట్ల కుటుంబ అనుచరులు, నాయకులతో భారీ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్‌కి వచ్చినవాళ్ళందరూ కూడా వైకాపాలో చేరదామని ముక్తకంఠంతో కోరడంతో వైకాపాలో చేరాలని కోట్ల కుటుంబం నిర్ణయించుకుంది. ఎంపిటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఇంకా అనేక పదవులు నిర్వహించిన వాళ్ళు ఈ మీటింగ్‌కి భారీగా హాజరయ్యారు.

చంద్రబాబువి కుట్ర రాజకీయాలు, అవినీతి రాజకీయాలని, చంద్రబాబును అస్సలు నమ్మలేమని వచ్చిన నాయకులు బాబుని తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్ కుటుంబం మాట మీద నిలబడుతుందని, జగన్ నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారని అందుకే వైకాపాలో చేరదామని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు వైఎస్ జగన్ నాయకత్వమే సరైనదని వచ్చిన నాయకులు అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే వైఎస్ జగన్‌ని కలిసి వైకాపాలో చేరబోతోంది కోట్ల కుటుంబం. ఈ మీటింగ్‌లో కోట్ల కుటుంబం నినాదాలతో పాటు జై జగన్ నినాదాలు కూడా భారీగా వినిపించడం నాయకుడిగా వైఎస్ జగన్‌కి ఉన్న భారీ క్రేజ్ ఏంటో చెప్పేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -