Thursday, May 2, 2024
- Advertisement -

ఉత్త‌మ్ ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్య‌ల‌కు ట్విట్ట‌ర్‌లో కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్‌..

- Advertisement -

ఎన్నిక‌ల వేల తెలంగాణా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలక కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు.

లేనిపోని ఆరోపణలతో అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని హితవు పలికారు.ఇకనైనా ఉత్తమ్ దిగజారుడు రాజకీయాలు మానుకుంటే మంచిదని అన్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నారని, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచారని కితాబిచ్చిన ఆయన, అనవసర రాజకీయాలు చేస్తూ, పోలీసుల శ్రమను కించపరచవద్దని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని సూచించారు.

నిజాయితీగా ప‌నిచేస్తున్న అధికారుల‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌న‌లు చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. అంత‌కు ముందు కేసీఆర్ మాయ‌లో ప‌డి ఫోన్‌లు ట్యాపింగ్ చేస్తున్నార‌ని ..ఉత్త‌మ్ డీఐజీ ప్రభాకరరావు, ఇంటలిజెన్స్‌ అధికారి రాధాకృష్ణ, మరో ఉన్నతాధికారి నరసింగరావులపై ఈ ఆరోపణలు చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అధికారులు ఇలా ఇష్టారీతిన ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -