Monday, April 29, 2024
- Advertisement -

మునుగోడు వార్ : ఆ పార్టీకే పట్టం కట్టిన సర్వేల ఫలితాలు !

- Advertisement -

గత కొన్ని రోజులుగా తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక రేపిన రాజకీయ వేడి అంతా ఇంత కాదు. గతంలో ఏ ఉపఎన్నికకు లేనంత అటెంక్షన్ మునుగోడు బైపోల్ పై కెంద్రీకృతం అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మునుగోడులో జెండా పాతెందుకు టి‌ఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వేసిన వ్యూహాలు, ప్రతివ్యూహాలు, అస్త్రశాస్త్రాలు.. అని కూడా పోలిటికల్ హిట్ ను తారస్థాయికి చేర్చాయి. ఇక ఎట్టకేలకు నవంబర్ 3న మునుగోడు పోలింగ్ పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్స్ హడావిడి మొదలైంది. గెలుపుపై మూడు పార్టీలు ధీమాగా ఉన్న నేపథ్యంలో ఎక్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలు అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలన్నీ దాదాపుగా అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టాయి.

థర్డ్ విజన్ రీసెర్చ్ ఇచ్చిన సర్వేల్లో 48-50 % టి‌ఆర్‌ఎస్ పార్టీకి, 31-35 % వరకు బీజేపీకి, 13-15 % కాంగ్రెస్ పార్టీ ఓట్లు పోల్ అయినట్లు సర్వేలో వెల్లడించింది. ఇక ఎస్ కె ఎస్ గ్రూప్ సర్వే ఫలితాల ప్రకారం.. 41 శాతం నుంచి 42 శాతం వరకు టి‌ఆర్‌ఎస్ కు ఓట్లు నమోదు అయ్యాయని, బీజేపీ కి 35 శాతం నుంచి 36 శాతం ఓట్లు, అలాగే కాంగ్రెస్ కు 16 శాతం నుంచి 17 శాతం వరకు ఓట్లు పోలైనట్లు తెలిపింది. మరో సర్వే సంస్థ నేషనల్ ఫ్యామిలీ సర్వే ఫలితాల ప్రకారం టి‌ఆర్‌ఎస్ కు 42 శాతం, బీజేపీకి 35.17 శాతం, కాంగ్రెస్ కు 22 శాతం ఓట్లు నమోదు అయ్యినట్లు తెలిపింది. అయితే ఈ సర్వేలన్నీ కూడా టి‌ఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండడం గమనార్హం. మరి ఓటర్ నాడీని ఈ సర్వేలు నిజంగానే ప్రతిభింబిస్తున్నాయా ? లేదా ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యే విధంగా ఫలితాలు వెలువడనున్నాయా ? అనేది తెలియాలంటే నవంబర్ 6న వెలువడే ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -