Tuesday, April 30, 2024
- Advertisement -

అభ్య‌ర్తుల జాబితాపై నాయిని అస‌హ‌నం… ఫోన్ స్విఛ్ఛాప్ చేసిన మేయ‌ర్ రామ్మోహ‌న్

- Advertisement -

ముందస్తు ఎన్నిక‌ల్లో భాగంగా అసెంబ్లీనీ ర‌ద్దు చేసిన కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల‌కు షాక్ ఇచ్చే విధంగా 105 మంది అభ్య‌ర్తుల జాబితాను ప్ర‌క‌టించారు. ఆ జాబితాలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే టికెట్లు ఇచ్చారు. టికెట్లు రాని కొందరితో పాటు కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారును పెండింగ్‌లో పెట్టేశారు కేసీఆర్. నగరంలోని ముషీరాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించకపోవడంపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మనస్తాపానికి గురవడం కారణమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

అందుకే కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు నాయిన హ‌జ‌రుకాలేదు. తాను సూచించిన అభ్యర్థికి టికెట్‌ ఇవ్వలేదని నాయిని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో ముషీరాబాద్‌ స్థానం నుంచి తన సమీప బంధువు, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన కేసీఆర్‌ నిర్వహించిన విలేకరుల సమావేశానికి సైతం దూరంగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఆ జాబితాలో ముషీరాబాద్‌ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముఠా గోపాల్‌ పేరు ఉందన్న సమాచారంతో నాయిని అలిగినట్టు తెలిసింది.

నిజానికి అభ్యర్థుల జాబితాలో ఆ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముఠా గోపాల్‌ పేరు ఉందన్న సమాచారంతో నాయిని అలిగినట్టు సమాచారం. ఆ కారణంతో అభ్యర్థుల ప్రకటన వెల్లడించే సమావేశానికి నాయిని రాలేదని ప్రచారం జరిగింది. దీంతో చివరి నిమిషంలో ముషీరాబాద్‌ అభ్యర్థి ప్రకటనను వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు కేసీఆర్ బీజేపీ నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీల్లో చర్చ జరుగుతోంది.

హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అలకబూనారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేక పోవడంపై ఆయన నిరాశకు గురయ్యారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రామ్మోహన్ ఆశించారు. ఎక్కువ‌గా ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపైనే దృష్టిసారించారు.

మేయ‌ర్ ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు. టికెట్ ను భేతి సుభాష్ రెడ్డికి ఖరారు చేశారు. దీంతో, మనస్థాపానికి గురైన రామ్మోహన్… నిన్న జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ కు కూడా హాజరుకాలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -