Tuesday, April 30, 2024
- Advertisement -

తెలంగాణలో కూడా పవన్ పొత్తు ఉంటుందా ?

- Advertisement -

తెలంగాణలో అప్పుడే ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటినుంచే వ్యూహ రచనకు పదును పెడుతున్నాయి. ఉన్న అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకునేందుకు టి‌ఆర్‌ఎస్ ప్రయత్నిస్తుంటే.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది. దాంతో ఈ రెండు ప్రధాన పార్టీల మద్య నెలకొంటున్న రాజకీయ పరిణామాలు పోలిటికల్ సర్కిల్స్ లో బాగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ గట్టిగా ఫోకస్ పెట్టింది. హుజూరాబాద్, దుబ్బాక తో పాటు గ్రేటర్ ఎన్నికల్లో కూడా సత్తా చాటి టి‌ఆర్‌ఎస్ కు బలమైన ప్రత్యర్థి పార్టీగా బీజేపీ దూసుకొచ్చింది.

ఇక ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో ఏకంగా గెలిచినంత పని చేసింది. ఇక ఇదే ఊపులో వచ్చే ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసి కాషాయ పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది. అయితే గెలుపు కోసం బీజేపీ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుంది అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీకి మిత్రా పక్షంగా ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో కూడా మద్దతు పలికే అవకాశం ఉందనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి వ్యాఖ్యలపై గతంలో జనసేన గాని, ఇటు కమలనాథులు గాని పెద్దగా స్పందించలేదు. అయినప్పటికి మోడీ, అమిత్ షా కోరిక మేరకు బీజేపీ తరుపున పవన్ ప్రచారం చేసే అవకాశం ఉందనే వాదనలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జనసేనతో పొత్తు కేవలం ఏపీ వరకే పరిమితం అని, తెలంగాణలో బీజేపీకి ఎలాంటి పొత్తు అవసరం లేదని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికరంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణలో బీజేపీ తరుపున పవన్ ప్రచారం చేస్తారనే వార్తలుకు తెరపడినట్లైంది. ఒకవేళ తెలంగాణలో బీజేపీ తరుపున పవన్ ప్రచారం చేస్తే.. బీజేపీ గెలుపులో క్రెడిట్ అంతా కూడా పవన్ కు చేకూరే అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతం రాజింగ్ పార్టీగా ఉన్న బీజేపీకి పొత్తులు కలుపుకొని క్రెడిట్ ఇతరులకు ఇచ్చే కన్నా సింగిల్ గానే బరిలోకి దిగి విజయం సాధించాలనేది కమలనాథుల వ్యూహంగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి బీజేపీ జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితం అని బండి సంజయ్ వ్యాఖ్యలతో తేలిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈసారి గెలిస్తే మరో 30ఏళ్ళు మనమే !

కర్నూల్ పై బాబు ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా ?

జగన్ పార్టీపై బీజేపీ కుట్ర.. కే‌సి‌ఆర్ మాటల్లో నిజమెంత ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -