Friday, April 19, 2024
- Advertisement -

కడప జిల్లాలో దుర్ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి : పవన్ కళ్యాన్

- Advertisement -

క‌డ‌ప జిల్లాలో ఘెర విషాదం చోటు చేసుకుంది. కలసపాడు మండలం, మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి క్వారీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడే పనుల్లో ఉన్న 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. క‌డ‌ప జిల్లా క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్ల‌ప‌ల్లె శివారులో ఈ రోజు ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిలెటిన్‌స్టిక్స్ ను వాహ‌నంలో తీసుకొస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని తెలిసింది.

ప్ర‌మాద‌వ‌శాత్తు వాహ‌నంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. తాజాగా ఈ ఘటన పై పలువురు రాజకీయ నేతలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్స్ స్టిక్స్ పేలి పది మంది చనిపోయారన్న వార్త హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మామిళ్లపల్లె దుర్ఘటన చోటుచేసుకున్న ముగ్గురాయి గనుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్ ఛార్మి.. వరుడు ఎవరో తెలుసా?

కరోనా భారిన పడ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్..

క‌డ‌ప జిల్లాలో భారీ పేలుడు.. 10 మంది మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -