Monday, April 29, 2024
- Advertisement -

రైతుల‌పై ఎమ్మెల్యే బోడా బూతుపురాణం

- Advertisement -

వ్యవసాయం పై ఆదారపడటం టైం వేస్ట్‌..  ఈ మాట‌లు అన్న‌ది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.  లేదు ఆయ‌న అలా అన‌లేదు అంటారా.  17-డిసెంబర్-1999 రోజు దిన‌ప‌త్రిక‌లు తిర‌గేస్తే క‌నిపిస్తోంది ఈ వ్యాఖ్య‌లు.  ఏ ప‌త్రిక‌ల జోలికి వెళ్ల‌ద్దొ మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది.  ఎందుకంటే అలాంటి వార్త‌లు అందులో రావు.  కానీ 2014 ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి రైతుల ఓట్ల విలువ తెలిసొచ్చింది.  అందుకే రుణ‌మాఫీ అంటూ ఓట్లు వేయించుకొని గ‌ద్దెనెక్కారు. కానీ ఆయ‌న మాట‌లు మాత్ర‌మే మారాయి.. చేత‌లు కాద‌ని అధికారంలోకి వ‌చ్చిన కొన్నాళ్ల‌కే అర్థ‌మైంది.

మాట్లాడే తీరు మారింది కానీ చంద్ర‌బాబు రైతుల‌తో వ్య‌వ‌హ‌రించే తీరు ఏ మాత్రం మార‌లేదు.  ఇప్పుడీ ప్ర‌స్తావ‌న ఎందుకంటే చంద్ర‌బాబు బాట‌లోనే న‌డుస్తున్నారు ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేలు. ఆవు చేలో మేస్తే.. దూడ గ‌ట్టును మేస్తుందా అన్న‌ట్టు ఉంటుంది ఆ పార్టీ నేత‌ల‌ది.  రైతులంటే చుల‌క‌న భావం వారిలో క‌నిపిస్తూనే ఉంటుంది.  నోరు తెరిస్తే అచ్చ‌మైన తెలుగులో మాట్లాడే పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడ ప్ర‌సాద్‌.. రైతుల‌పై బూతుపురాణం అందుకున్నారు.  

జ‌న‌వ‌రి 11న ఉయ్యూరులో జ‌రిగిన గ్రామ‌స‌భ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బోడ ప్ర‌సాద్ పాల్గొన్నారు.  ఈ స‌భ‌కు హాజ‌రైన ప‌లువురు రైతులు త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారించాలంటూ ఆయ‌న‌ను అడిగారు.  అక్క‌డే ఉన్న వైఎస్ఆర్‌సీపీ నేత పార్థసారథి కూడా ప‌లు స‌మస్య‌ల‌పై ప్ర‌శ్న‌లు లేవ‌నెత్త‌డంతో స‌మాధానాలు చెప్ప‌లేక గొడ‌వ‌కు దిగారు.  దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా త‌మ స‌మ‌స్య‌ల సంగ‌తేంట‌ని రైతులు ప్ర‌శ్నించ‌డంతో స‌హ‌నం కొల్పోయిన బోడ‌.. ఇక బూతుపురాణం అందుకున్నారు.  నానా మాటాలంటూ అక్క‌డి నుంచి నిష్క్ర‌మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -