Wednesday, May 1, 2024
- Advertisement -

వామ్మో న్యూ ఇయర్ కి ఓ రేంజ్ లో తాగారు బాబోయ్!

- Advertisement -

ప్రపంచం ఏటన్నా పోనీ.. కరోనా వచ్చిన ఆగమైనా కానీ.. మేం మాత్రం ప్రశాంతంగా మందేసి సేద తీరుతాం అన్న చందంగా ఉంది ఈ ఏడాది మందుబాబుల పని. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మందు విక్రయం.. ఆదాయం వచ్చిందంటున్నారు. తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేకున్నప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం దుమ్మురేపాయి. 

గత ఏడాదితో పోలిస్తే.. రూ. 758.76 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ. 300 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్టు తెలిపింది. 2021 నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం మద్యం దుకాణల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరిగాయి. ఇక నాలుగు రోజుల్లో మొత్తం 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీర్ కేసులు అమ్ముడుపోయినట్టు ఆబ్కారీ అధికారులు తెలిపారు. ఒకవేళ కొవిడ్-19 లేకపోయి ఉండుంటే.. మద్యం అమ్మకాలు మరింత పెరిగేవి అంచనా మద్యం దుకాణదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -