Monday, April 29, 2024
- Advertisement -

BREAKING NEWS: నేను బాగానే ఉన్నా.. 10 ఏళ్ల వరకు నేనే సీఎంగా ఉంటా!

- Advertisement -

టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తాజాగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ముందుగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్ర పటానికి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏప్రిల్‌లో 6 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఏ జిల్లా వాళ్ళు ముందుకు వస్తే అక్కడే సభ నిర్వహిద్దామని సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నేను ఆరోగ్యం గానే ఉన్నానని అయన తేల్చి చెప్పారు. కేటీఆర్ సీఎం అవుతున్నారనే అంశం మీద స్పందిస్తూ ఎందుకు అలా మాట్లాడ్తున్నారని ప్రశ్నించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. 10 ఏళ్ల సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. 

మంత్రి కేటీఆర్ విషయంపై లేని పోని అపోహలు సృష్టించవొద్దని అన్నారు. ఒకవేళ గీత దాటి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని నాయకులను హెచ్చరించారు. ఫిబ్రవరి నెల అంతా మెంబెర్ షిప్ డ్రైవ్, మార్చి నెల అంతా గ్రామా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు ఉంటుందని ఆయన అన్నారు. ఏప్రిల్ లో రాష్ట్ర కమిటీ,పార్టీ ప్లీనరీ ఉంటుందని ఆయన అన్నారు.  మరోవైపు ఖమ్మం,వరంగల్, నల్గొండ గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని కన్ఫామ్ చేశారు ముఖ్యమంత్రి.

ఆ జీవో బాబే తెచ్చారు.. వ‌ల్ల‌భ‌నేని వంశీ ఫైర్‌!

ఏపీ సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపిన గంటా శ్రీనివాస్!

దానిమ్మ తో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు!

విశాఖ స్టీల్ ప్లాంట్, నాదెండ్ల ను బకరా చేసిన పవన్ కల్యాణ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -