Wednesday, May 8, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లోకి షర్మిల…ముహుర్తం ఫిక్స్!

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 17న జరిగే కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. ఈ మేరకు టైం ఫిక్స్‌ కాగా సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు షర్మిల. రాష్ట్రనేతలు పలువరు వ్యతిరేకించినా కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో భేటీ అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు షర్మిల. సోనియా – షర్మిల మధ్య దాదాపు 40 నిమిషాల పాటు భేటీ జరుగగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో షర్మిల సేవలను ఉపయోగించుకోనుంది కాంగ్రెస్.

అయితే షర్మిల రాకను పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నా అగ్రనేతలు ఓకే చెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైలెంట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుంది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సికింద్రాబాద్ లేదా పాలేరు నుండి బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న ఖమ్మం జిల్లా నేతలు మాత్రం షర్మిలకు పాలేరును ఇచ్చే పరిస్థితి లేదు. సీనియర్ నేత రేణుకా చౌదరి బహిరంగంగానే పాలేరుకు షర్మిల ఏం చేసిందనే ప్రశ్నించారు. అసలు షర్మిలకు ఊరు పేరు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోని షర్మిల తనపని తాను చేసుకుంటు పోతున్నారు.

ఇక సెప్టెంబర్ 17నే ముహుర్తం ఖరారు చేసుకోవడానాకి ప్రధాన కారణం తెలంగాణ విమోచన దినోత్సవం. ఇప్పటికే బీఆర్ఎస్,బీజేపీ,కాంగ్రెస్ పోటాపోటిగా తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ భారీ బహిరంగసభకు ప్లాన్ చేసింది. ఈ సభకు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు అగ్రనేతలు హాజరుకానుండగా వీరి సమక్షంలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు షర్మిల. ఈ మేరకు భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ సభ ద్వారానే షర్మిలకు ఇచ్చే పదవిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీకాంగ్రెస్ వర్గాల సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -