Tuesday, May 7, 2024
- Advertisement -

బుద్దా వెంక‌న్న‌కు ఇప్పుడు జ్ఞానోద‌యం అయిందే..!

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ఎంత‌లా అంటె త్వ‌ర‌లో టీడీపీ క‌నుమ‌రుగ‌య్యే స్థాయికి రాజ‌కీయాలు చేరాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో బాబుకు అండ‌గా ఉన్న నేత‌లంతా ఇత‌ర పార్టీల్లోకి వెల్తున్నారు. తాజాగా న‌లుగురు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు భాజాపా కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే బుద్దా వెంక‌న్న మాత్రం న‌లుగురు స‌భ్యుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూనె సీఎం జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డిల‌పై ఓ రేంజ్‌లో పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంటే టీడీపీలో ఫైర్ బ్రాండ్. టీడీపీని ఎవరైనా తిడితే తన మాటల తూటాలతో ఎదురుదాడి చేస్తుంటారు. ఇక జ‌గ‌న్, విజ‌య‌సాయి అంటె చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటి బుద్దా హఠాత్తుగా విజయసాయిరెడ్డిని మెచ్చుకోవడం ఆస‌క్తిక‌రంగా మారింది.

బీజేపీలో చేరిన నలుగురు ఎంపీల్లో టీజీ వెంకటేష్ మినహా.. మిగిలిన ముగ్గురు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని దద్దమ్మలు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడు నమ్మి వారిని రాజ్యసభకు పంపితే ఆయన గొంతు కోశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ నలుగురు ఎంపీల కంటే విజయసాయిరెడ్డి నయం. ఓ కమిట్ మెంట్ ఉంది. జగన్ వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా విజయసాయిరెడ్డి ఆయన వెంటే ఉన్నారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిలబడ్డారు. అలా ఉండాలి. అంతే కానీ, పార్టీ ఓడిపోగానే వేరే కండువా కప్పుకోవడం నీచం.’ అని బుద్ధా వెంకన్న అన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఏది ఏమైనా ఫిరాయింపుల విష‌యంలో ఆల‌స్యంగా నైనా బుద్దా కు బుద్ది వ‌చ్చిన‌ట్లుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -