Tuesday, April 30, 2024
- Advertisement -

మోడీ ఫ్యాక్టర్‌…పోటీ అంటేనే జంకుతున్న నేతలు!

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్దిరోజుల్లో షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పాలమూరు కేంద్రంగా ఎన్నికల శంఖారావం పూరించారు. ఇక త్వరలోనే కేంద్ర బీజేపీ పెద్దలు సైతం తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా ఎన్నికల్లో పోటీ అంటే మాత్రం జంకుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.

ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారితో పాటు మరికొంతమంది సీనియర్లను అసెంబ్లీకి పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఎమ్మెల్యేకు పోటీ చేయమని…ఛాన్స్ ఇస్తే ఎంపీకి పోటీ చేస్తామని చెబుతున్నారు. దీనికి కారణం 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చని భావిస్తున్నారు బీజేపీ నేతలు.

అంబర్ పేట నుంచి రెండు సార్లు గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు.. ఇప్పుడు కూడా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకే కిషన్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారు. మరో ఎంపీ బండి సంజయ్ సైతం కరీంనగర్ పార్లమెంట్ స్థానంపైనే ఫోకస్ చేశారు. కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేయడానికి విముఖత చూపిస్తున్నారు. మాజీ ఎంపీ రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేస్తానని చెప్పినప్పటికీ ఇప్పుడు పార్లమెంటుకే పోటీ అంటున్నట్లు తెలుస్తోంది.

వీరి బాటలోనే ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ వివేక్,కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి సైతం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. చాడా సురేష్ రెడ్డి, రవీంద్రనాయక్ కూడా ఎంపీగా పోటీచేసేందుకే సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్‌తో ఈజీగా గెలవొచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్‌ కొల్పోయింది. అయితే ఎంపీ ఎన్నికల్లో మాత్రం మోడీ ఇమేజ్‌తో 4 ఎంపీ స్ధానాలను దక్కించుకుంది. అందుకే అసెంబ్లీ కంటే పార్లమెంట్‌కే పోటీచేయడం మేలని కాషాయ నేతలు ఆ విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -