Saturday, April 27, 2024
- Advertisement -

కేంద్రంపై కేటీఆర్ ఫైర్

- Advertisement -

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ, పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధుల విషయంలో బీజేపీ, టీఆర్ ఎస్ నేతల మధ్య గత కొంత కాలంగా మాటలు యుద్ధం నడుస్తోంది. ఇదివరకే ఈ అంశాలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప‌లు మార్లు కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా రాష్ట్ర అసెంబ్లీ వేదిక‌గా కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కేంద్రంపై ఫైర్ అయ్యారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై మాట్లాడుతూ.. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు పారిశ్రామిక రాయితీలు ఇస్తామ‌ని పేర్కొంది. అయితే, దీనికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌పైసా కూడా ఇవ్వ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అలాగే, కేంద్ర ప్ర‌భుత్వ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా ఎవరికి కూడా రూపాయి ప్రయోజనం కలగలేదని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ ప్యాకేజీతో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. కేంద్రం ద్వారా తెలంగాణకు వచ్చిందేమీ లేదని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో కేంద్రాన్ని మ‌రో మారు సంప్ర‌దిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ల‌క్ష‌లాది మందికి న్యాయ సాయం అందట్లేదు: సుప్రీం జడ్జి జస్టిస్​ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు మెట్లెక్కిన తెలుగు అకాడమీ అంశం

దూకుడు పెంచిన ప్రియమణి

తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం

బుల్లితెరపై అదరగొట్టబోతున్న విజయ్ సేతుపతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -