Monday, April 29, 2024
- Advertisement -

సీట్ల‌పై త‌ర్వ‌ర‌గా తేల్చండి..రాహుల్‌తో భేటీత‌ర్వ‌త కోదండ‌రామ్‌

- Advertisement -

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సమావేశం అయ్యారు. ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు మీద చర్చించారు. సీట్ల పంపకాలు త్వరగా తేల్చాలని రాహుల్ గాంధీని కోరారు. రాహుల్ గాంధీతో ప్రధానంగా కూటమి ఏర్పాటు విషయంపైనే చర్చించానని కోదండరాం తెలిపారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్దమైన ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించారని, ఈ దిశగా కూటమి సఫలమైందని కోదండరాం తెలిపారు.

రాహుల్‌తో కోదండరాం సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. అట్టడుగు వర్గాల వారి సమస్యలకు పరిష్కారం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ క్రమంలో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని వెళ్తున్నట్టు చెప్పారు. తమకు 17 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు కోదండరాం తెలిపారు. కనీసం 15 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలనే సీట్ల సర్దుబాటు, కూటమి ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గాను 95 స్థానాల్లో కాంగ్రెస్‌, 14 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తాయని ఢిల్లీలో గురువారం కాంగ్రెస్‌ నేతలు కుంతియా, ఉత్తమ్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐలకు 10 స్థానాలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అయితే, పూర్తిస్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత తమ నిర్ణయం చెబుతామని కోదండరాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -