Sunday, April 28, 2024
- Advertisement -

పీకే నిర్ణయంతో టీపీసీసీ నేతలకు ఊరట

- Advertisement -

పీకే నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఊరటగా మారిందా ? పైకి ఎలాంటి ప్రకటనా చేయకపోయినా టీపీసీసీ నాయకులు లోలోపల ఆనందంతో ఉన్నారా ? తాజా పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్న చాలా మందిలో ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ లో ప్రశాంత కిశోర్ చేరిక లాంఛనమేనంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. నేడో రేపో అధికారిక ప్రకటన అంటూ ఒక దశలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ కు పీకే సలహాదారుగా పని చేస్తున్నారు. ఇటీవలే కేసీఆర్ తో వరుసగా రెండ్రోజుల పాటు భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్ లో చేరినా తన సంస్థ ఐప్యాక్ టీఆర్ఎస్ కోసం పని చేస్తుందంటూ పీకే ప్రకటన కూడా చేశారు.

ఒక వేళ పీకే కాంగ్రెస్ లో చేరినా.. తెలంగాణలో టీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఆయన పని చేస్తే తమ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు టీపీసీసీ నేతల్లో వ్యక్తమయ్యాయి. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ లు పొత్త పెట్టుకోబోతున్నాయన్న ప్రచారమూ జరిగింది. తెలంగాణ బీజేపీ నేతలు సైతం ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. అదీ కాక పీకేపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ వల్ల కాకే పీకేను నియమించుకున్నారనీ.. ఎంత మంది పీకేలు వచ్చినా ఏం పీకలేరంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

దాంతో ఒకవేళ ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరితే.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తారేమోనని ఆయన అనుచర వర్గంలో అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే తాను కాంగ్రెస్ లో చేరబోనంటూ పీకే తాజాగా ప్రకటన చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు. వాస్తవానికి తమ పార్టీలో చేరాలంటూ పీకే ..ఇతర పార్టీల కోసం పని చేయడం మానుకోవాలంటూ సీనియర్లు కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అది నచ్చకే పీకే .. కాంగ్రెస్ లో చేరడం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

ఉచితాలు కొంప ముంచుతాయ్

అలా చేస్తే ఏపీ శ్రీలంక అవుతుందా… : జగన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -