Thursday, May 9, 2024
- Advertisement -

బీఎల్ఎఫ్ త‌రుపు నుంచి తెలంగాణా ఎన్నిక‌ల బ‌రిలో ట్రాన్స్ జెండ‌ర్‌…

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌ల బ‌రిలోకి ఈ సారి ట్రాన్స్ జెండ‌ర్ దిగ‌బోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుంచి బీఎల్‌ఎఫ్ పార్టీ తరపున మువ్వల చంద్రముఖి ఎన్నికల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. ఈ స్థానంనుంచి టీఆర్ఎస్‌, భాజాపా అబ్య‌ర్తుల నుంచి గ‌ట్టిపోటీ ఎదుర్కోనుంది.

ఉత్త‌న విద్య‌ను అభ్య‌సించిన చంద్ర‌ముఖి భరతనాట్య కళాకారిణి. అంతేకాదు వ్యాఖ్యాత, సినీ నటి కూడా. చూడ చక్కగా కనిపించే చంద్రముఖి … ఇప్పుడు చట్టసభల్లో తమ గొంతును వినిపించేందుకు ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధిగా ఎన్నికల సంగ్రామంలోకి దిగుతున్నారు.

రాజకీయ పార్టీలు, ప్రజ, హక్కుల సంఘాల మద్దతుతో ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు చంద్రముఖి. మహిళలపై కొనసాగుతున్న అన్నిరకాల అణచివేతలు ట్రాన్స్‌జెండర్లపైన కూడా ఉన్నాయంటున్నారు. లక్షమందికి పైగా ట్రాన్స్‌జెండర్లు తెలంగాణలో ఉన్నా.. గత నాలుగున్నరేళ్లుగా మా సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు. అనేక రకాల సమస్యలపై మా కమ్యూనిటీ ఎప్పుడూ పోరాడుతూ వస్తుందన్నారు చంద్రముఖి. ట్రాన్స్‌జెండర్ల అస్తిత్వాన్ని చట్టసభల్లో ప్రతిబింబించేందుకు , తమ సమస్యల్ని మరింత బలంగా వినిపించేందుకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యానని చెబుతున్నారు.

తాను గెలిస్తే కేవలం ట్రాన్స్ జెండర్ల ప్రతినిధిగానే కాకుండా గోషామహల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. బీఎల్ఎఫ్ త‌రుపున బ‌రిలోకి దిగుతున్న చంద్ర‌ముఖి ఈ ఎన్నిక‌ల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. ఎన్నిక‌ల్లో గెలిచి తెలంగాణా అసెంబ్లీలో అడుగు పెడితే చ‌రిత్ర సృష్టించిన‌ట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -