Friday, April 26, 2024
- Advertisement -

వణుకుతున్న అసెంబ్లీ..ముట్టడిలో పెద్దల సభ..!

- Advertisement -

ప్రభుత్వం ఎస్సీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ…. బిజేపి ఎస్సీ మోర్చా నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బిజేపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు బిజేపి శ్రేణులను అరెస్ట్​ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి… ఎలాంటి చర్యలు తీసుకోలేదని బిజెపి ఎస్సీ మోర్చా నాయకులు ఆరోపించారు.

అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల చెరకు రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.


అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని… ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్​ విస్మరించారని రైతులు ఆరోపించారు. వెంటనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు.

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

థియేటర్లు మూసివేసేది లేదు : మంత్రి తలసాని

ఈ పెయింటింగ్ ఖ‌రీదు రూ.450 కోట్లు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -