Tuesday, April 30, 2024
- Advertisement -

దేశంలో నెంబ‌ర్ వ‌న్ బ‌ఫూన్ రాహుల్‌….కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తా…? కేసీఆర్‌

- Advertisement -

తెలంగాణాలో ముంద‌స్తుఎన్నిక‌ల ఊహాగానాలాకు తెర‌దించారు కేసీఆర్‌. అసెంబ్లీనీ ర‌ద్దు చేసి ఏకంగా 105 మంది అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌త్య‌ర్థి పార్టీల గుండెల్లో గుబులు రేపారు.అసెంబ్లీ రద్దు అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకొని నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని దేశంలోకెల్లా అతి పెద్ద బఫూన్‌గా కేసీఆర్ అభివర్ణించారు. సభలో మోదీకి రాహుల్ కన్నుగీటడం, హత్తుకోవడం పట్ల కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్‌ను వారసుడిగా పేర్కొన్న కేసీఆర్.. ఢిల్లీకి గులాంగిరీ చేయొద్దని తెలంగాణ ప్రజలను కోరారు.

కాంగ్రెస్, టీడీపీ పొత్తు విషయమై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘ఆ మాట అనడానికి సిగ్గు ఉండాల‌న్నారు. ఆంధ్రా పార్టీలతో పొత్తు ఏంటి’ అని ఆయన నిలదీశారు.అసదుద్దీన్ ఓవైసీ తనంతట తానుగా నాకు ఢిల్లీలోనే ఫోన్ చేసి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ, కలిసి పని చేస్తున్నాం. స్నేహపూర్వకంగానే ఎన్నిక‌ల్లో క‌ల‌సి పోటీ చేస్తామ‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -