Tuesday, April 30, 2024
- Advertisement -

పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఆనం… వెంక‌ట‌గిరి రేసులోకి నేదురుమ‌ల్లి రామ్ కుమార్‌

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్న కొద్ది వైసీపీలో టికెట్ల లొల్లి మొద‌ల‌య్యింది. పార్టీలోకి వ‌ల‌స‌లు పెర‌గ‌డంతో నియోజ‌క వ‌ర్గానికి ఇద్దురు, ముగ్గురు నేతలు టికెట్‌రేసులో ఉన్నారు. తాజాగా అలాంటి ప‌రిస్థితి నెల్లూరు వైసీపీలో చోటు చేసుకుంది. వెంక‌ట‌గిరి నియోజ‌క వ‌ర్గం టికెట్ విష‌యంలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది.

ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, నేదురు మల్లి రాంకుమారార్ వైసీపీలో చేరారు. ఇద్ద‌రు నేత‌లు వెంక‌ట‌గిరి టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. టికెట్టు నేదురు మ‌ల్లి రామ్ కుమార్‌క‌నే ప్ర‌చారం జ‌ర‌గుతోంది. దీంతో ఆనం కొద్ది రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో రకరకాల ప్రచారాలు , ఊహాగానాలు ఊపందుకొంటున్నాయి.

ఆనం వ్యవహార శైలిని చూస్తే వెంకటగిరిలో ఆయన పోటీపై అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీలో చేరిన వెంటనే ఆయన్ను వెంకటగిరి ఇన్‌చార్జిగా ప్రకటించారు జ‌గ‌న్‌. నియోజ‌క వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం మూడు సమావేశా లు మాత్రమే నిర్వహించారు. సుమారు నెల రోజులు నియోజకవర్గం వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఎన్నికలు సమీపిస్తు న్న క్రమంలో ఆనం ఇలా పర్యటనలకు దూరంగా ఉండ టం నియోజకవర్గ ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తున్నది.

పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌టంతో పోటీ చేయ‌డంపై అనుమానాలు క‌లుగుతున్నాయి. ఆనం నెల్లూరు పార్లమెంట్‌కు కానీ, లేదా ఆత్మకూరులో కానీ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వెంక‌టిగిరి స్థానంపై జ‌గ‌న్‌నుంచి హామీ రాలేదు. దీంతోనే ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మ‌రో వైపు వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చిం ది. ఆయన తండ్రి దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనా ర్దనరెడ్డి, ఆయన తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మిలు ఈ నియోజకవర్గం నుంచి పలుమార్లు పోటీచేసి గెలి చారు. వారి కుటుంబానికి ఈ నియోజకవర్గంలో మంచి ప‌ట్టుంది. తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ టిక్కెట్టు ఇస్తామని చెప్పినా, తన సొంత నియోజకవర్గమైన వెంకటగిరి నుంచి పోటీ చేయా లనే ఆశతో వైసీపీలో చేరినట్లు ప్రచారం జరిగింది. నేదురుమల్లి కే టిక్కెట్టు ఇస్తారని, ఫిబ్రవరిలో అధి కారికంగా ప్రకటిస్తారనే ప్రచారం జరు గుతోంది. దీంతో ఇంతకు వైసీపీ అభ్యర్థి ఎవరు.. రామనారాయణ రెడ్డా…? నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డా..? అనే గంద‌ర‌గోలంలో ఉన్నారు వైసీపీనేత‌లు, కార్య‌క‌ర్త‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -