Monday, May 6, 2024
- Advertisement -

క‌త్తి దాడి ఘ‌ట‌న కేసులో జ‌గ‌న్‌కు స‌మ‌న్లు జారీచేసిన విశాఖ కోర్టు..

- Advertisement -

జ‌గ‌న్‌పై క‌త్త దాడి ఘ‌ట‌న కేసు ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. ఈ ఘ‌ట‌న‌పై థ‌ర్డ్ పార్టీ చేత విచార‌ణ జ‌రిపించాల‌ని హైకోర్టును కోరిన సంగ‌తి తెల‌సిందే. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టులో విచార‌ణ‌లో ఉంది. అయితే తాజాగా విశాఖపట్నం కోర్టు జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చింది. కత్తి దాడి కేసులో స‌మ‌న్లు జారీ చేసింది.

విశాక ప‌ట్నం ఎయిర్ పోర్టులో దాడి కేసులో కీల‌క సాక్ష్యంగా ఉన్న జ‌గ‌న్ ర‌క్త‌పు మ‌ర‌క చొక్కా కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది కోర్టు. నవంబరు 23 ఉదయం 11 లోపు కోర్టుకు అందజేయాలని విశాఖ ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు స్పష్టంచేసింది. సిట్ విచార‌ణ‌లో భాగంగా సెక్షన్‌ 91 సీఆర్‌పీసీ ప్రకారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం రక్తపు మరకలున్న చొక్కాను సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు విజయనగరం జిల్లా పార్వతీపురంలో తనపై జరిగిన కత్తిదాడి గురించి తొలిసారి నోరు విప్పారు జగన్. తనను చంపేందుకు చంద్రబాబు కుట్రచేశారని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో జరిగిన కత్తి దాడి వెనక చంద్రబాబు హస్తముందని విమర్శించారు. ఏపీ ప్ర‌భుత్వ విచార‌ణ‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఎందుకు దర్యాప్తు చేయించడం లేదని జగన్ బాబును ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.

అక్టోబరు 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఎదురుచూస్తున్న సమయంలో జగన్‌పై వెయిటర్ శ్రీనివాస్ కత్తితో దాడి చేశారు. దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -