Monday, April 29, 2024
- Advertisement -

జగన్ ను పవన్ మిర్శించడం తగ్గించడం వెనుక కారణం..?

- Advertisement -

జగన్ ఏదైన చెబితే అందుకు రివర్స్ లో అంటారు.. పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన నాటి నుండి పవన్ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా జగన్‍నే భావించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున పోరాడతానని చెప్పిన పవన్ తెలంగాణ ప్రభుత్వం పట్ల ఎప్పుడు సానుకూల దృక్పథం కలిగి ఉన్నాడు. వీలైతే కేసీఆర్ నిర్ణయాలను స్వాగతిస్తూ పవన్ మీడియా ముఖంగా కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే జగన్ పట్ల ఆయన వైఖరి అలా ఉండదు. దూకుడు స్వభావం.. వరుస వ్యాఖ్యలతో రెచ్చిపోతుంటారు. జగన్ తీరు మారి తన పాలనపై నమ్మకం కుదిరి వరకు జగన్ రెడ్డి అని మాత్రమే అని పిలుస్తాను అని చెప్పి పవన్ తన వ్యతిరేకతను తెలియజేశారు.

కారణమేంటో తెలియదుగానీ గత కొంతకాలంగా పవన్ జగన్ పై విమర్శల దాడి తగ్గించారు. ఈ మధ్య జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన పల్లెత్తు మాట అనలేదు. రాజకీయ నాయకుల అరెస్టు పై టిడిపి నానా యాగీ చేస్తున్న పవన్ మాత్రం నోరు మెదపలేదు. గతంలో టిడిపి చేసే ప్రతి విమర్శ పవన్ కూడా వత్త పడేవారు. అది ఇప్పుడు కనిపించడం లేదు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పై టిడిపి హైకోర్టు నుంచి స్టే తీసుకువచ్చి నిలిపివేసింది.

దీనిపై అటూ జగన్ ప్రభుత్వం గురించి కానీ టిడిపి విమర్శలపై కానీ పవన్ తన స్టాండ్ ఏమిటో వ్యక్తపరచలేదు. టిడిపి రోజుకొక విమర్శతో సోషల్ మీడియా వేదికగా నానా యాగీ చేస్తున్న పవన్ మాట్లాడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవల అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకోగా పవన్ సోషల్ మీడియాలో కేవలం ఒక లెటర్ లో రైతులు అభిప్రాయాలను గౌరవించాలని వారికి రావలసిన పరిహారం చెల్లించాలని నివేదన పూర్వకంగా వ్యవహరించారు. ఒకప్పుడు ఆయన రాజధాని ఒక అంగుళం కూడా కదిలించలేరు నేను ఉన్నానని అనే వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే. ఒంటరిగా ఉన్నప్పుడు దూకుడు చూపిన పవన్ అధికార పార్టీ బిజెపి అండ ఉంచుకుని సైలెంట్ ఎందుకు అయ్యాడు అనేది ఎవరికీ అర్థం కావడంలేదు.

విమర్శించకపోగా కొత్త అంబులన్సెల కొనుగోలు, కరోనా నిర్వహణలో భేష్ అంటూ జగన్ ను పొగడటం కూడా చూశాం. అకస్మాత్తుగా పవన్ తో మొదలయ్యే ఈ పరివర్తన కారణం ఏంటో అంతుపట్టడం లేదు. ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వం పై విమర్శలు దాడి తగ్గించారా ? ఇక ఇదే వైఖరిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాడా అనేది చూడాలి. ఏపీ ప్రభుత్వం పై పవన్ విమర్శల దాడి తగ్గించిన వేల ఆంధ్ర బిజెపి నాయకులు విమర్శలు జోరు పెంచడం విశేషం.

జగన్ నిర్ణయం.. విడుదల రజినికి గుడ్ న్యూస్..?

చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయిన ఎంపీ విజయసాయి రెడ్డి

ఎంపీ రఘురామకు ఊహించని షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు..!

కేసీఆర్ కంటే జగనే బెటర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -