Thursday, May 2, 2024
- Advertisement -

జగన్ వారిపై అసహనంగా ఉన్నారా?

- Advertisement -

వైసీపీలో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లకు ప్రాధాన్యత తగ్గిందా? జగన్ వీరిని పట్టించుకోవడం లేదా? వీరిద్దరు ఒకప్పటిలా యాక్టివ్ గా లేకపోవడానికి కారణం ఆదేనా? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. రెండవ సారి మంత్రి వర్గ విస్తరణలో వీరిద్దరు కచ్చితంగా ఉంటారని భావించరంతా. కానీ అలా జరుగలేదు. మంత్రి పదవి నుంచి వీరిని తప్పించి ఇతరులకు అవకాశం ఇచ్చారు జగన్. ఇక మంత్రి పదవి పోయినది మొదలుకొని వీరిద్దరు పెద్దగా యాక్టివ్ గా కనిపించిన దాఖలాలు లేవు. అడపా దడపా కొడాలి నాని అప్పుడప్పుడు మీడియా ముందు కనిపిస్తున్నప్పటికి.. మునుపటి జోరు మాత్రం కనిపించడం లేదనేది చాలా మంది అభిప్రాయం.

ఇక అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి పోయినది మొదలుకొని అసలు మీడియా ముందుకు రావడమే అరుదైంది. దాంతో వీరిద్దరు మునుపటి జోరు చూపించకపోవడానికి కరణమేమిటి అనే దానిపై రకరకాల వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మంత్రి వర్గం నుంచి తీసివేసిన తరువాత కొడాలి నాని కొంత అసహనానికి గురయ్యారట. అంతే కాకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పులో కూడా జగన్ నిర్ణయంపై అసంతృప్తి చెందారట నాని. దాంతో అప్పటి నుంచి పార్టీ మరియు ప్రభుత్వ కార్యకలాపాలకు పెద్దగా హాజరు కావడం లేదనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

ఇక జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” గగప గడపకు మన ప్రభుత్వం ” లో కూడా కొడాలి నాని, మరియు అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు పెద్దగా పాల్గొనింది లేదు. దాంతో జగన్ వీరి తీరుపై అసహనంగా ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక తాజాగా రీజినల్ కో ఆర్డినేటర్ల భాద్యతనుంచి కూడా వీరిని తప్పించారు సి‌ఎం జగన్. మరి రాబోయే రోజుల్లో కొడాలి నాని మరియు అనిల్ కుమార్ యాదవ్ వంటి వారికి వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ఎలాంటి జగన్ ఎలాంటి పదవులు అప్పగిస్తారు ? అసలు వీరికి జగన్ ప్రాధాన్యత కల్పిస్తారా అనే చర్చ కూడా ఆసక్తికరంగా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

బాబుకు మోడీ పిలుపు.. బంధం బలపడేనా?

బీజేపీ సినీ మంత్రం.. ఎందుకోమరి?

పవన్ ప్లాన్ అదుర్స్.. అక్కడే స్పెషల్ ఫోకస్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -