Monday, April 29, 2024
- Advertisement -

జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారాణికి మ‌రో సారి బ్రేక్‌..

- Advertisement -

ఈ నెల 11న మొద‌టి విడ‌త‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ప్ర‌చారానికి మిగిలిది నాలుగు రోజులే. ఇప్ప‌టికే అన్ని పార్టీలనాయ‌కులు జెట్ స్పీడ్‌తో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఎన్నికల వ్యూహంపై పార్టీ నాయకులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయడానికి, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడానికి ఈ నెల 2వ తేదీన ప్రచారానికి విరామం ఇచ్చిన వైఎస్ జగన్ శ‌నివారం కూడా మ‌రో సారి విరామం ఇవ్వ‌నున్నారు. అమరావతిలో రేపు ఉగాది వేడుకల్లో పాల్గొననున్న వైసీపీ అధినేత… అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలు, అభ్యర్థులకు ఆహ్వానాలు పంపించారు.

ఏప్రిల్ 6వ తేదీన అమ‌రావ‌తి, తాడేపల్లి గ్రామంలోని పార్టీ కేంద్ర కార్యాలయం నందు ఉదయం 8:15 గంటలకు ఉగాది ఆస్థానానికి చేరుకోవటం, తదుపరి గురువందనం, పంచాంగానికి అర్చన, పంచాంగ శ్రవణం, వేదస్వస్తి, ఉగాది ప్రసాదం స్వీకరించటం, ఆఖ‌రిలో పండిత సత్కారం ఉంటుందని… పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -