Monday, April 29, 2024
- Advertisement -

వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. ఫైర్ అయిన షర్మిల!

- Advertisement -

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని శివాయిగూడెం స్టేజి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైంది. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు గ్రామస్తులు తెలిపారు.

వైఎస్ తనయ షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని.. ఆమెకు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వైఎస్ అభిమానులు, షర్మిల అనుచరులు ఆరోపిస్తున్నారు. దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని 2013లో వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. కాగా, వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటనపై ఆయన కుమార్తె వైఎస్ షర్మిల స్పందించారు. ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్యగా అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. “విగ్రహాలు ధ్వంసం చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్‌ను తొలగించలేరు” అని ఆమె పేర్కొన్నారు. విగ్రహ ధ్వంసంపై వైఎస్ అభిమాని, స్థానిక నాయకుడు పిట్టా రామ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విగ్రహ ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించారు. ఖమ్మం సభను అడ్డుకునేందుకే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామ్ రెడ్డి డిమాండ్ చేశారు. కూల్చివేసిన చోటే మళ్లీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇదిలా ఉంటే.. ప్పటికే ఆమె తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. వారి వద్ద నుంచి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. అలాగే విద్యార్థులతోనూ షర్మిల సమావేశం నిర్వహించారు.

ఆ 122మంది నిర్దోషులే.. అసలు ఏమైంది అంటే..!

ఒకటేమో గాల్లోనే చక్కర్లు.. మరొకటి ఏకంగా రద్దు..!

వైరల్ అవుతున్న శర్వానంద్, రామ్ చరణ్ ఫోటోలు….!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -