Monday, April 29, 2024
- Advertisement -

చంద్ర‌బాబు దీక్ష‌కు వ్య‌తిరేకంగా మ‌రో అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీస్తున్న జ‌గ‌న్‌

- Advertisement -

ఎండ‌లు ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తిస్తుంటే …. మ‌రో వైపు ఏపీలో రాజకీయం ఎమ‌రింత వేడిని పుట్టిస్తున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక‌హోదాపై జ‌రిగిన పోరాటం ఇప్పుడు మ‌రో కీల‌క మ‌లుపు తిరుగుతోంది. ప్ర‌త్యేక‌హోదా పోరాటంలో వైసీపీ మ‌రో సంచ‌ల‌నానికి రెడీ అవుతోంది. ఇదే జ‌రిగితే దేశ రాజ‌కీయాల్లో ఓ సంచ‌ల‌నంగా మార‌నుంది.

ప్ర‌త్యేక‌హోదాపై బాబు వేస్తున్న ఎత్తుల‌కు వైస్ జ‌గ‌న్ పైఎత్తులు వేస్తున్నారు. మొద‌టినుంచి ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాటం చేసిన పార్టీ వైసీపీ. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌జ‌ల‌నుంచి వ్య‌తిరేక‌త రాకుండా చూసుకొనేందుకు బాబు త‌న పుట్టిన రోజు ఒక రోజు దీక్ష‌కు దిగుతున్నారు. ప్ర‌త్యేకహోదా కోసం దీక్ష‌లు, రాజీనామాలు చేస్తే లాభం ఏంట‌ని ప్ర‌శ్నించిన బాబుకూడా జ‌గ‌న్ దారిలోకే వ‌స్తున్నారు.

తాజాగా ధర్మపోరాట దీక్ష అంటూ పుట్టిన రోజు నాడు తాను చేసే ఉపవాస దీక్షను నిరాహార దీక్ష కింద చూపి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు జగన్ గట్టి అస్త్రం తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం దీక్ష చేస్తే ఒత్తిడి పెరుగుతుంద‌ని భావించిన జ‌గ‌న్ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేయడంతో మైలేజీ వచ్చిందని భావించిన జగన్, సీఎం దీక్ష రోజు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే రాజకీయంగా మరింత కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. 2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా నినాదాన్నే ప్రచారాస్త్రంగా మలచుకోవాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది.

వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినా త‌న పార్టీ ఎంపీల చేత బాబు రాజీనామా చేయించ‌కుండా డ్రామాలాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బాబుపై ప్ర‌జ‌ల్లో ఒత్తిడి పెరుతోంది. ఒక వేల జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తే బాబు ప‌రిస్థితి మ‌రింత అగ‌మ్య‌గోచ‌రంగా మార‌డంలో సందేహంలేదు. మ‌రి బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -