Wednesday, May 1, 2024
- Advertisement -

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై నివేదిక‌ను జ‌గ‌న్‌కు ఇచ్చిన ప్ర‌శాంత్ కిషోర్ బృందం…

- Advertisement -

నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు కొంచెం డీలా ప‌డ్డారు. గెలుపు త‌మ‌దేన‌ని పెట్టుకున్న ఆశ‌లు ఆడియాశ ల‌య్యాయి. ఫ‌లితాలు ఇలా ఎందుకు వ‌చ్చాయె స్ప‌ష్ట‌మైన కార‌నాలు తెలియ‌క పోయిన‌ప్ప‌టికి పార్టీలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. అయితే ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల ఫలితాలపై తన బృందంతో నివేదికలను తెప్పించుకుని, లోతుగా విశ్లేషించారు.

నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఓట‌మికి గ‌ల కార‌నాల‌తో పాటు .. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై జగన్ కు నివేదిక అందించారు. ఈ నివేదికలో వైసీపీ అధినాయకత్వానికి పీకే కొత్త సూచనలు చేశారు. కొత్త టార్గెట్ లను నిర్ణయించారు. పీకె సూచ‌న‌ల ఆధారంగా జ‌గ‌న్ వ్యూహాలు ర‌చిస్తున్నారు.

పార్టీ అంతర్గత నిర్మాణం సరిగా లేదని నివేదికలో పీకే తెలిపారు. ఇదే పార్టీకి పెద్ద మైనస్ పాయింట్ అని స్పష్టం చేశారు. వెంటనే సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని… అయితే నెల రోజుల్లోనే అది పూర్తి కావాలంటే… మిస్డ్ కాల్ విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు. దీనికే… సభ్యత్వ నమోదు అనే పేరు కాకుండా… వైయస్ఆర్ కుటుంబం అనే పేరును పెట్టుకున్నారు. మిస్డ్ కాల్ ఇచ్చిన ప్రతి వ్యక్తిని వైసీపీ సభ్యుడిగా గుర్తిస్తారు. కనీసం కోటి మిస్డ్ కాల్స్ ను వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. జగన్ పాదయాత్ర చేపట్టబోయే లోపల కోటి మందిని వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగానె వైఎస్ వ‌ర్థంతి రోజు పులివేందుల‌లో వైఎస్ఆర్ కుటుంబం పేరుతో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఇప్ప‌టికె ఆకార్య‌క్ర‌మం ప్ర‌జ‌ల‌ల్లో దూసుకుపోతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యానికి వైఎస్ కుటుంబంలో ప్ర‌తీ ఒక్క‌రిని చేర్పించే విధంగా టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు ఆదిశ‌గా పార్టీ ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికె వైఎస్ఆర్ కుటుంబం మిస్డ్ కాల్‌కు భారీ స్పంద‌న వ‌స్తోంది. ఇది వైసీపీ శ్రేణుల్లో మ‌రింత జోష్ పెరుగుతుండ‌టంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -