Sunday, April 28, 2024
- Advertisement -

సోనియాను జగన్ ఎదిరించబట్టే సోనియాకు కోపం వచ్చి కేసులు పెట్టించిందిః చంద్రబాబు

- Advertisement -

అదీ నిజాయితీకి ఉన్న పవర్. ఎంత అబద్ధాలతో మేనేజ్ చేద్దామనుకున్నా ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. అది కూడా తరచుగా అబద్దాలు చెప్పేవాళ్ళ నోటి నుంచే నిజం బయటపడితే ఇంకెలా ఉంటుంది? ‘సోనియా గాంథీని జగన్ ఎదిరించారు…..అందుకే సోనియిాకు కోపం వచ్చింది…..ఆ కోపంతోనే జగన్‌పై కేసులు పెట్టించారు…..’ ఈ మాటలు చెప్పింది జగన్ కాదు. వైకాపా నాయకులు కూడా కాదు. సాక్షి మీడియా కూడా కాదు. ప్రపంచంలోనే జగన్‌ని మించిన అవినీతిపరుడు, రాక్షసుడు లేడు అని పొద్దస్తమానం విషం కక్కుతూ ఉండే టిడిపి వారి నుంచే ఈ డైలాగ్ వచ్చింది. అది కూడా ఆ పార్టీ అధినేతకు చెంచాగిరి చేసే నాయకులో, ఆ పార్టీ భజన మీడియానో ఈ మాట చెప్పలేదు. వాళ్ళందరికీ నాయకుడు….టిడిపి అధినేత అయిన చంద్రబాబే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. కావాలంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరిన సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన ప్రసంగాన్ని చూడండి. రాష్ట్ర విభజన సమయంలో తనను తాను హీరోగా చెప్పుకుంటూ సీమాంధ్రులను నిండా ముంచిన కిరణ్ కుమార్ రెడ్డిని పొగిడే ప్రయత్నంలో ఈ నిజం ఒప్పేసుకున్నాడు చంద్రబాబు. తుఫాన్లు, సునామీలను ఆపలేనేమో కానీ విభజనను ఆపేస్తా అన్న కిరణ్ కుమార్ రెడ్డి, లాస్ట్ బాల్‌కి సిక్స్ కొడతా అన్న కిరణ్ కుమార్ రెడ్డి …..అసరమైన టైంలో కనీసం రాజీనామా కూడా చేయకుండా అంతా అయిపోయేదాకా వెయిట్ చేసి చేతులెత్తేసి విభజన పర్వంలో బెస్ట్ కమెడియన్‌గా మిగిలిపోయిన కిరణ్ కుమార్ రెడ్డిని హీరోని చేసే ప్రయత్నంలో తమ కుమ్మక్కును కూడా పరోక్షంగా ఒప్పుకున్నాడు చంద్రబాబు.

ఇక అదే సందర్భంలో కిరణ్‌ని హీరోని చేస్తూ ….‘వైఎస్ జగన్‌ సోనియాను ఎదిరించాడు కాబట్టే సోనియాకు కోపం వచ్చి కేసులు పెట్టించింది….అయినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం సోనియాను ఎదిరించడానికే నిర్ణయించుకున్నాడు.’ అని మాట్లాడాడు చంద్రబాబు. ఇక్కడే కొన్నేళ్ళుగా వైఎస్ జగన్ చెప్తున్న విషయాన్ని సాక్షాత్తూ చంద్రబాబునాయుడే ఒప్పుకున్నాడు. మరి ఇకపై కూడా జగన్ అవినీతి చేశాడు కాబట్టే కేసులు ఉన్నాయి అని మాట్లాడతారా? అలా అయితే సోనియాకు కోపం వచ్చి కేసులు పెట్టించింది అని ఎందుకు చెప్పినట్టు? ఇక్కడ కూడా ఎప్పటికెయ్యది అప్పటి మాటలు అన్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతారా? ఏది ఏమైనా చంద్రబాబు మాటలు మాత్రం వైకాపాకు రాజకీయంగా కలిసొచ్చేవే .అందుకే వైకాపా జనాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చంద్రబాబు మాటలను హైలైట్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం జగన్ మంచి వాడే. కానీ సోనియాను ఎదిరించి బయటకు వచ్చేసరికి చెడ్డవాడు అయిపోయాడు. సోనియాతో చంద్రబాబు కూడా కుమ్మక్కయి నాపై కేసులు బనాయించారు అని ఇన్నాళ్ళుగా జగన్ చెప్తున్న మాటలకు ఇప్పుడు చంద్రబాబు మాటలు బలం చేకూరుస్తున్నాయి. జగన్ అవినీతికి పాల్పడ్డాడా? లేదా? అన్న విషయం ఇంకో టాపిక్‌లో చెప్పుకుందాం కానీ సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కయి జగన్‌పై కేసులు పెట్టించారు అన్నది నిజం. ఈ రోజుకీ కూడా విచారణ సంస్థల్లో ఉన్న తన అనుకూల అధికారుల ద్వారా జగన్‌ని ఇబ్బందులు పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడన్నది కూడా నిజం. ఇప్పుడు ఈ నిజాలే చంద్రబాబు నోటి నుంచి కూడా వచ్చాయి అని అనుకోవాలి. చంద్రబాబు మాటలను టిడిపి నేతలు, ఆ పార్టీ భజన మీడియా ఎలా సమర్థిస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -