Friday, May 3, 2024
- Advertisement -

ఫోన్ పోయిందని బాధపడకండి.. ఈ ట్రిక్ తో ఎక్కడుందో కనుక్కోండి

- Advertisement -
Find Lost Phone

ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. తమ దగ్గర ఉన్న పర్సు పోయిన ఎక్కువగా భాధపడరేమో గానిస్మార్ట్ ఫోన్ పోయిందంటే మాత్రం చాలా భాధపడతారు. ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్ లో ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ తో పాటు ఫోటోలు, వీడియోల రూపంలో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి.

ఎన్నో సార్లు మన ఫోన్ మనకి తిరిగి దొరకడం చాలా అరుదు. పోయిన ఫోన్ ఎక్కడుందో తెలుసుకోడానికి రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకుని టైం మరియు డేటా ని వృధా చేసుకోకండి. ఎందుకంటే పోయిన స్మార్ట్ ఫోన్ ని లొకేట్ చేయడానికి గూగుల్ ఓ ఆప్షన్ అందిస్తుంది. ఈ ఆప్షన్ పేరు -Find My Phone- 

* మీ ఫోన్ లో ఎల్లప్పుడూ గూగుల్ ఎకౌంటులో లాగ్ ఇన్ అయి ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో ఫోన్ పోతుందో ఎవరు చెప్పలేరు కనుక. ఒకవేళ ఫోన్ పోతే ఈ కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయిపోండి చాలు.

* ముందుగా ఏదైనా కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో బ్రౌజర్ ఓపెన్ చేయండి.

* గూగుల్ సెర్చ్ లో Find My Phone అని టైపు చేయండి.

* ఒకవేళ మీరు మీ ఇంట్లోనే ఫోన్ ఎక్కడైనా పారేసుకుంటే Ring అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీ ఫోన్ సైలెంట్ లో ఉన్నా గాని ఫుల్ వాల్యూంలో ఆగకుండా 5 నిమిషాల వరకు రింగ్ అవుతుంది. ఫోన్ దొరకగానే పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే రింగ్ ఆగిపోతుంది.

* ఒకవేళ మీ ఫోన్ ని ఎవరైనా దొంగలించినా లేదా ఎక్కడైనా పారేసుకున్నా Locate అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. గూగుల్ ప్రకారం మీ ఫోన్ చివరిగా ఎక్కడ లొకేట్ అయ్యిందో మ్యాప్ లో చూపిస్తుంది.

Related

  1. మీ ఏటిఎం కార్డులను యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు!
  2. జియోకి షాక్ ఇచ్చిన కేంద్రం!
  3. మోడీ కీ నోట్‌ యాప్‌ వెనక ఉన్న నిజం ఇదే!
  4. అక్కడ పుట్టుమచ్చ ఉంటే… ఆ విషయంలో మీరు నంబర్ వన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -