Thursday, April 18, 2024
- Advertisement -

మళ్లీ పరుగు పెడుతున్న బంగారం ధర.. దానితో పాటే వెండి!

- Advertisement -

ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ చుట్టేసింది. ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాదు.. మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ క్రమంలో బంగారం మాత్రం తన సత్తా చాటుతూ వచ్చింది. లాక్ డౌన్ సమయంలో కూడా బంగారం ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. దానితో పాటే వెండి ధరలు కూడా చుక్కలనంటాయి. ఇక కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత పసిడిపై ప్రభావం పడింది.. ధరలు తగ్గుతూ వచ్చాయి.

కాకపోతే ఇది రెగ్యూలర్ గా కాకుండా అప్పుడప్పుడు మళ్లీ ధరలు పెరగడం బంగారు ప్రేమికులను కాస్త ఇబ్బంది పెడుతున్నాయి.  పసిడి రేటు మళ్లీ పెరగడం గమనార్హం. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది.  హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగింది.

దీంతో రేటు రూ.46,300కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.350 పెరుగుదలతో రూ.42,450కు చేరింది. దీనితో పాటే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.800 పెరిగింది. దీంతో రేటు రూ.72,800కు ఎగసింది. 

దిల్ రాజు షాక్.. ‘వి’ సినిమాను తొలగించిన అమెజాన్ !

ఇలయ దళపతి విజయ్ 65వ మూవీ ఆ నేపథ్యంలోనే?

యూట్యూబ్ లో సాయిపల్లవి మరో సంచలనం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -