Monday, April 29, 2024
- Advertisement -

మోడీ మైండ్ లో ఇంకొక మాష్టర్ ప్లాన్ .. కొత్త టార్గెట్ ఇదే 

- Advertisement -
Gold may beNarendra Modi’s next target 

పెద్ద నోట్ల రద్దు తరవాత నల్ల కుబేరుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి అనేది అత్యంత విశ్వసనీయమైన విషయం. మోడీ మాస్టర్ మైండ్ లో ఇంకా చాలా ఐడియా లు ఉన్నాయి అనీ ఒక్కొక్కటీ నెమ్మదిగా టైం రాగానే బయటకి వదులుతారు అనీ తెలుస్తోంది. మోడీ తర్వాతి చర్య ఖచ్చితంగా బంగారం పైనే ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.

మన దేశం లో నల్లదనం మొత్తం భూములు – బంగారం రూపం లో ఉంటుంది. నోట్ల రద్దు వ్యవహరం కాస్త సర్దుకో గానే బంగారం మీద మోడీ మైండ్ పెడతారు అని తెలుస్తోంది. ఇళ్ళలో బంగారం నిల్వలను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. బంగారం వ్యాపారస్తులు  ముందుగానే జాగ్రత్త పడుతూ ఉండడం తో ఈ మేరకు లెక్కలు తేలుతున్నాయి. పోయిన వారం గోల్డ్ ప్రీమియం రెండేళ్ళ గరిష్టానికి చేరుకుంది.  నోట్ల రద్దు తర్వాత బంగారం దిగుమతులపై పరిమితులు విధించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బంగారం వ్యాపారస్తులు ఇప్పుడే పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తున్నారు.

ప్రపంచంలో బంగారం కొనుగోళ్లలో భారత్ రెండోస్థానంలో ఉంది. ఏడాదికి సుమారు వెయ్యి టన్నుల బంగారాన్ని భారత్ కొనుగోలు చేస్తోంది. ఇందులో సుమారు మూడోవంతు వ్యాపారం నల్లధనంతోనే జరుగుతున్నట్లు అంచనా. లెక్కల్లోకి రాని సొమ్ముతోనే బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నగదు ఆధారిత గోల్డ్ స్మగ్లింగ్ తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు – కొత్త కరెన్సీ కొరత వల్ల ఇప్పటికే వినియోగదారుల దగ్గర నగదు కొరత తీవ్రమైంది. ఆ ప్రభావం బంగారం కొనుగోళ్లపై పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ పరిణామంపై స్పందించడానికి ఆర్థికశాఖ నిరాకరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -