Thursday, May 2, 2024
- Advertisement -

” ఇందిరా గాంధీ తాను చనిపోతారు అని ఆమెకి ముందే తెలుసు “

- Advertisement -

సొంత బధ్రతా సాయుధుల చేతుల్లో బలైన మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ మరణం గురించి ఊహించని వార్తలు బయటకి వస్తున్నాయి. ఆమె బతికి ఉన్న సమయం లోనే చనిపోవడానికి కొద్ది రోజుల ముందరే చావు గురించి ఆమెకి పూర్తి సమాచారం ఉంది అని చెబుతున్నారు.

ఈ విషయం కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా గాంధీ బతికి ఉన్న సమయం లో నమ్మిన బంటు గా ఉన్న ఫోతేదార్ చెప్పడం విశేషం. తన చావు ముందే ఊహించిన ఆమె తన తరవాత రాజకీయ వారసురాలిగా ప్రియాంకా గాంధీ ని అప్పట్లో నే ప్రకటించారు అని అంటున్నారు ఆయన. టైమ్స్ ఆఫ్ ఇండియా కి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఆయన ఈ విధమైన విశేషాలు తెలిపారు. రాబోయే కాలానికి ప్రియాంకా గాంధీ గొప్ప నేతగా ఎదుగుతుంది అని ఆమె నమ్మే వారు అని ఆయన అన్నారు. ” ఇందిరా చనిపోవడానికి మూడు రోజుల ముందే నేను ఆమెని కలిసాను, ఇద్దరం కాశ్మీర్ లో ఒక గుడికి ధర్శనం కోసం వెళ్ళాము. ఆమె తిరిగి డిల్లీ కి వస్తున్న క్రమం లో ఆమె మనసులో మాటలు బయటపెట్టారు. ప్రియాంక తన వారసురాలు కావాలి అనేది ఆమె కోరిక అని అప్పుడు తెలిపారు. ఆ రాత్రి ఆమె నోటితో చెప్పిన ప్రతీ మాటనీ నేను ఎప్పటికీ మరచిపోలేను, వింత ఏంటంటే నేను అవన్నీ రాసుకున్నాను కూడా , ఆమె రాసుకోమని కోరారు” అని ఇంటర్వ్యూ లో తెలిపారు ఆయన. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -