Saturday, April 20, 2024
- Advertisement -

పాద‌యాత్రలో పీకే టీం సీక్రెట్ స‌ర్వేల ఆధారంగానె టికెట్లు…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మొద‌లు పెట్టిన ప్ర‌జాసంక‌ల్పం యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల‌నుంచి అనూహ్యంగా మ‌ద్ద‌తు వ‌స్తోంది. రోజు రోజుకి జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల‌నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఎక్క‌డి కెల్లినా జ‌గ‌నం వేలాదిగా త‌ర‌లి వ‌చ్చి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ప్ర‌జా స్పంద‌న‌ను చూసి వైసీపీ నేత‌లు మ‌రింత ఉత్సాహంతో ముందుకెల్తున్నారు.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. దానిలో భాగంగానె ఆరునెల‌ల‌పాటు ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌ను ప్రారంభించారు. ఆపార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా పీకెను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికె రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు స‌ర్వేలు నిర్వ‌హించి పీకె టీం ఇప్పుడు జ‌గ‌న్ పాద‌య‌త్ర‌లో చురుగ్గా పాలుపంచుకుంటోంది.

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు ఎలాంటి స్పంద‌న వ‌స్తోంది, ప్రసంగంలో ఏ అంశానికి ఎక్కువగా జనం నుంచి స్పందన వస్తోంది వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రశాంత్‌ టీం సభ్యులు కెమెరాలతో యాత్రలో పాల్గొంటూ అరుదైన దృశ్యాలను రికార్డు చేస్తు మ‌రో వైపు జనంతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. స్థానిక నాయ‌కుల‌కు ఎలాంటి బ‌లంఉందోకూడా ఆరాతీస్తున్నారు.

జగన్ యాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారాన్ని కూడా ప్రశాంత్ టీం పర్యవేక్షిస్తోంది. ప్ర‌త్యేకంగా నలుపు రంగు టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు యాత్రలో పాల్గొంటున్నారు. కేవలం యువకులే కాకుండా మహిళా సభ్యులు కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేస్తున్నారు.

జగన్‌ యాత్రకు మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది.. వారు వైసీపీ నుంచి ఎలాంటి పనితీరును ఆశిస్తున్నారు వంటి అంశాలను పాద‌యాత్ర పూర్త‌య్యేంత వ‌ర‌కు క్రోడీకరించ‌నున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం కోసం ప్రత్యేక వాహనాన్ని కేటాయించారు. టీం సభ్యులు ఆ వాహనం మీద నుంచే పాదయాత్రను రికార్డు చేస్తున్నారు. జగన్ స్పీక్స్ వీడియో సీరీస్‌ను ప్రశాంత్ కిషోర్ టీ మే పర్యవేక్షిస్తోంది. వీరంతా కూడా జ‌గ‌న్ పాద‌యాత్రను ప‌ర్య‌వేక్షించ‌డంతోపాటు టికెట్ ఆశిస్తున్న నాయ‌కుల‌కు స్థానికంగా ఎంత‌పాపులారిటి ఉందో తెలుసు కొనేదానికి కొంద‌రు ప్ర‌జ‌ల‌ల్లో క‌ల‌సిపోయి వారంతా సీక్రెట్‌గా స‌ర్వే చేస్తున్నారు.వారు ఇచ్చే నివేదిక‌ల‌మీద‌నె టికెట్లు కేటాయించ‌నున్నార‌నె వార్త‌లు. వ‌నిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -