Monday, April 29, 2024
- Advertisement -

శ్రీకాకుళంలో వింత : కుక్క కడుపులో ఏనుగు.. !

- Advertisement -

భూమి మీదా అప్పుడప్పుడు రకరకల జంతువులను గుర్తిస్తుంటారు. అలానే ఓ జంతువు కడుపులో మరో జంతు ఆకారంలో ఉన్న జంతువు పుట్టడం.. ఇలా రకరకల విషయాలను మనం చూస్తునే ఉన్నాం. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత చోటు చేసుకుంది. పాలకొండ వీధిలోని ఇటుకుల బట్టి వద్ద ఉండే ఓ కుక్క ఇటీవలే కొన్ని పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో ఓ కుక్క పిల్ల వింతైన ముఖంతో జన్మించింది.

ఆ కుక్క పిల్ల ముఖంకు ముక్కుకు బదులుగా తొండం వచ్చింది. దాంతో ఆ కుక్కపిల్ల ఏనుగు పిల్లాలా కనిపిస్తోంది. దాంతో స్థానికులు కుక్క కడుపులో ఏనుగు పుట్టిందని అంటున్నారు. ఆ కుక్కపిల్లను చూసేందుకు పొరుగు ఊర్ల నుంచి జనాలు తరిలి వస్తున్నారు. పొడవగా ఉన్న ముక్క వల్లా ఆ కుక్క పిల్ల ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

అది తల్లిపాలు తాగేందుకు ఇబ్బంది పడుతోందని.. తామే దానికి పాలు పడుతున్నామని స్థానికులు చెప్పారు. ఈ ఘటనను గమనించిన వైద్యులు స్పందిస్తూ.. జన్యు పరమైన లోపం వల్లే ఆ కుక్క పిల్ల అలా జన్మించిందని తెలిపారు. ఇక ఈ లక్షణాలతో పుట్టే కుక్క పిల్లలు బతకడం చాలా అరుదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -