Wednesday, May 1, 2024
- Advertisement -

నిద్ర‌మాత్ర‌లు వాడుతున్నారా… ! అయితే జాగ్రత్త

- Advertisement -

సిగ‌రెట్ క్యాన్స‌ర్ కార‌కం. వీటిని తాగ‌డం వ‌ల్ల భారీ మూల్యం త‌ప్ప‌దు అని ఎక్క‌డ చూసినా ప్ర‌క‌ట‌న‌లు చూస్తుంటాం. ఏటా దీనివ‌ల్ల ప్ర‌పంచంలో ల‌క్ష‌ల మంది క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణిస్తున్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. సైలెంట్ కిల్ల‌ర్ గా ఇదిమ‌నుషుల ప్రాణాల‌ను తీస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం విన్నాం కాని సిగ‌రెట్ కంటె ప్ర‌మాద‌క‌ర మైన‌టివి ఏంటో తెలుసా…! తెలిస్తే షాక్ అవ‌డం కాయం.

మారుతున్న జీవ‌న‌శైలి…. ప‌నుల ఒత్తిడి కార‌నంగా ప్ర‌పంచంలో కోట్ల మంది నిద్ర‌లేమితో భాద‌ప‌డుతున్నారు. దీనినుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు నిద్ర‌మాత్త‌ర‌లు తీసుకుంటున్నారు. తాత్కాలికంగా ఉప‌శ‌మ‌నం పొందినా త‌ర్వాత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్‌లాంటి వ్యాధుల బారిన ప‌డ‌టం కాయం. అయితే ఇది ఎంతమాత్రం సరైన విధానం కాదని, రోజుకు ఒక ప్యాకెట్‌ సిగరెట్లు కాల్చడం కన్నా నిద్రమాత్రలు ప్రమాదకరమని పరిశోధకులు తేల్చారు.

అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిద్రమాత్రలు కలగజేసే దుష్ఫలితాలపై నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. నిద్రమాత్రలతో క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకుడు షాన్‌ యంగ్‌స్టెడ్‌ వెల్లడించారు.

నిద్ర‌మాత్ర‌ల‌ను ఎవ‌రికంటె వాల్ల‌కు అమ్మ‌కుండా నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. దీని వ‌ల్ల‌ ప్ర‌భుత్వం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో ఇటీవల డైజిఫామ్‌ లాంటి నిద్రమాత్రల వాడకం కొంత తగ్గినప్పటికీ.. కొత్తగా వచ్చిన ‘జెడ్‌-డ్రగ్స్‌’ వాడకం పెరిగిందని వెల్లడించారు. అయితే.. ఇవి కూడా హార్ట్‌ ఎటాక్‌ అవకాశాన్ని 50 శాతం పెంచుతున్నాయని తెలిపారు.

చూశారుగా ఇప్ప‌టి వ‌ర‌కు సెగ‌రెట్లే ప్ర‌మాదం అనుకున్నారం. కాని వాటికంటె నిద్ర‌మాత్ర‌లు అత్యంత డేంజ‌ర‌స్‌. నిద్రమాత్రలను ఆశ్రయించడం కంటే వ్యాయామం చేయడం ద్వారా సహజనిద్ర లభిస్తుందని షాన్‌ వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -