Friday, April 26, 2024
- Advertisement -

ఎస్పీ – జానకి కాంబినేషన్ లో ఐదు సూఫర్ హిట్ పాటలు ఇవే..!

- Advertisement -

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎస్.జానకి కాంబినేషన్ అంటే పాటలో తేనెలు ఊరినంత హాయి. 1975 నుంచి 1995 వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు వీరిద్దరి పాటలు జనాల్ని ఉర్రూతలూగించాయి. వాటిలో ఐదు పాటల గురించి ఇక్కడ..

నవ్వింది మల్లె చెండు (అభిలాష)
చిరంజీవి-రాధిక కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమా ‘అభిలాష’ లో ఈ సాంగ్ చాలా పాపులర్. ఆనాటి కుర్రకారును ఆకట్టుకున్న అద్భుతమైన​ పాట. బాలసుబ్రమణ్యం గొంతుతో జానకి నవ్వు పోటీ పడుతూ పాట సాగుతుంది.

జిలిబిలి పలుకుల (సితార)
వంశీ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సితార’ సినిమాలోని ఈ పాట ఎంత ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ప్రతి స్టేజీ మీద ఈ పాట నేటికీ నిత్యనూతనంగా వినిపిస్తుంది. వేటూరి అద్భుతమైన సాహిత్యానికి బాలు, జానకి ప్రాణం పోశారు.

మౌనమేలనోయి (సాగరసంగమం)
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాటలన్నీ సంగీత ప్రియుల మనసులో చెరగని ముద్ర వేశాయి. ఇళయరాజా సంగీతంలో​ని ఈ పాట మెత్తని మల్లెలా మనసుని తాకుతుంది. జయప్రద అభినయం అద్భుతం.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (రాక్షసుడు)
ఎప్పుడు విన్నా, ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట. కోటికొక్క పాట. చిరంజీవి, సుహాసిని అభినయానికి బాలు, జానకి గాత్ర విన్యాసం అజరామరం. వేటూరి సాహిత్యం నభూతో నభవిష్యత్.

ప్రియతమా నను పలకరించు(జగదేకవీరుడు అతిలోకసుందరి)
‘ప్రాణవాయువేదో వేణువూదిపోయే’ అంటూ జానకమ్మ పాడితే, ‘దేవగానమంతా ఎంకి పాటలాయె’ అంటారు బాలు. తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయే పాట ఇది. చిరంజీవి నిజంగా జగదేకవీరుడే అనిపిస్తాడు. శ్రీదేవి అతిలోకసుందరి​ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గుప్పెడన్ని సీన్లు.. చిరకాలం గురుతులు.

నచ్చిన పాత్రలను మిస్ చేసుకున్న నటీనటులు..!

పాట.. పాట.. పాట.. ఎవరి నోట?

అనువాద పాటల్లో వేటూరి వెన్నెల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -