Wednesday, May 1, 2024
- Advertisement -

ఫిరాయింపుల వెనుక అస‌లు క‌థ ఇదే…?

- Advertisement -

ఏపీలో ఫిరాయింపుల రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. సంత‌లో ప‌శువుల్లా వేలం పెట్టి మ‌రీ అధికార‌పార్టీ టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేల‌ను కొంటోంది. మొద‌టి నుంచి అధికార‌పార్టీ ప్ర‌లోభాలకు గురిచేస్తూ, మంత్రి ప‌ద‌వులు, కాంట్రాక్టులు ఆశ చూపి ఫిరాయింపుల‌త‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని వైసీపీ ఆరోపిస్తున్నా…అధికార‌పార్టీ మాత్రం ఎందురుదాడికి దిగ‌డం చూస్తున్నాం. అభివృద్ధిని చూసి పార్టీలోకి వ‌స్తున్నార‌ని బాబు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అస‌లు విషయం ఏంటంటే సొంత పార్టీ ఎమ్మేల‌ల‌మీద న‌మ్మ‌కం లేక వారిని కాపాడుకొనేందుకే ఫిరాయింపులను ప్రోత్స‌హిస్తున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ 67 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకొని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా అవ‌త‌రించింది. త‌ర్వాత వైసీపీ నుంచి గెలిచిన నాయ‌కులు అధికార‌పార్టీ ప్ర‌లోభాల‌కు త‌లొగ్గి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఫిరాయించిన నేత‌లంద‌రూ బాబు హ‌యాంలో జ‌రుగుతున్న అభివృద్ధిని చూసి వెల్తున్నామ‌ని చెప్పిన మాట‌లు ఉత్తుత్తని గిడ్డి ఈశ్వ‌రి వీడియోతో తేలిపోయింది. పార్టీ ఫిరాయించినేత‌లే మేము ఎంత‌కు అమ్ముడు పోయామో బ‌హిరంగంగా చెప్పారు.

బీకాంలో ఫిజిక్స్ చ‌దివిన మేధావి జ‌లీల్ ఖాన్‌. వైసీపీ త‌రుపున గెలిచిన టీడీపీలోకి ఫిరాయించారు. ఈయ‌న‌కు బాబు రూ.30 కోట్లు ఆఫ‌ర్ చేశార‌ని ఊరికే పార్ట‌లో చేరాని చెప్పిన అతి తెలివి మేధావి. ఇక గొట్టిపాటి ర‌వి కూడా పార్టీ ఫిరాయించారు. దీంతో గొట్టిపాటి ర‌వికి, క‌ర‌నం బ‌ల‌రాం మ‌ధ్య విబేధాలు కొన‌సాగుతున్నాయి. ర‌వి రూ.200 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టే డానికే చేరార‌ని క‌ర‌నం బ‌ల‌రాం ఆరోపించారు.

ఇక మ‌రో ఫిరాయింపు నేత జ్యోతుల నెహ్రూ కూడా క్యాష్ ఇవ్వ‌లేదు గాని మంత్రి ప‌ద‌విని ఇస్తాన‌ని చెప్పార‌నె వార్త‌లు వ‌చ్చాయి. ఇక రంప‌చోడ‌వ‌రం ఎమ్మేల్యే రాజేశ్వ‌రి రూ.20 కోట్ల‌కు అమ్మ‌డుపోయింద‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నాయ‌కుల స్థోమ‌త‌ను బ‌ట్టి వారికి ఖ‌రీదు క‌డ్తున్నారు చంద్ర‌బాబు.

గిడ్డి ఈశ్వ‌రి చూస్తె బాక్సైట్ త‌వ్వ‌కాలు జ‌రిపితే బాబు త‌ల న‌ర‌కుతాం అని మాట్లాడిన ఈమెగారు చివ‌ర‌కు బాబు పాదాల ద‌గ్గ‌ర త‌ల‌ను తాక‌ట్టుపెట్టారు. టీడీపీలో చేరితే ఎస్టీ కార్పొరేష‌న్ ప‌ద‌వి, త‌ర్వాత మంత్రి ప‌ద‌వి, కాంట్రాక్టులలో ప‌ర్సేంటేజీలు ఇస్తామ‌ని చెప్పార‌ని కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన ఆడియో టేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. దీన్ని బ‌ట్టి చూస్తే ప్ర‌లోభాలు పెట్టి నాయ‌కుల‌ను చేర్చుకుంటున్నార‌నీ వైసీపీ చేసిన వాద‌న‌లు నిజ‌మ‌య్యాయి.

ఆధరించి టిక్కెట్టిచ్చి గెలిపించుకున్న ఆదినారాయణరెడ్డి కూడా వైసిపి నుండి వెళ్ళిపోయి మంత్రిపదవి తీసుకున్నారు. ఉత్తరాంధ్రలోని బొబ్బిలి రాజులని సుజయ్ కృష్ణ రంగారావుకు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తే వాళ్ళూ దెబ్బకొట్టి టిడిపికి జై కొట్టారు. మరో ఫిరాయింపు మంత్రి ఎన్. అమరనాధరెడ్డిది కూడా అదే దారి. అఖిల ప్రియ‌కూడా పార్టీలోకి ఫిరాయించి మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు.

అప్పులు తీర్చుకోవటానికని కొందరు, మంత్రిపదవుల కోసం మరికొందరు, కాంట్రాక్టులు, ఆర్ధిక అవసరాలని ఇంకొందరు, త‌మ‌పై ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి ఇలా ప‌లు కార‌ణాల‌తో ఇప్ప‌టికే 23 మంది ఫిరాయించేశారు. అధికార‌పార్టీ చేస్తున్న ప్ర‌లోభాలు బ‌య‌ట‌ప‌డుతున్నా….నిస్సిగ్గుగా అభివృద్ధిని చూసి పార్టీలోకి వ‌స్తున్నారంటూ బాబు క‌ప్పిపుచ్చుకుంటున్నారు. చ‌ట్టాల‌ను గౌర‌వించాల్సిన చంద్ర‌బాబునాయుడే సాక్ష్యాత్తు తుంగ‌లోకి తొక్కి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -