Monday, April 29, 2024
- Advertisement -

భండారం బయటపడిపోయింది…….. కింకర్తవ్యం శివాజీ?

- Advertisement -

శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చింది అన్న చందంగా చంద్రబాబు గూటి చిలుకలా ‘గరుడ పురాణం’ కథలు వినిపించిన కామెడీ యాక్టర్ శివాజీ భండారం బయటపడిపోయింది. ఇప్పటి వరకూ కూడా చాలా లౌక్యంగా రాజకీయం చేసిన శివాజీ కథ ఇక క్లైమాక్స్‌కి వచ్చినట్టే కనిపిస్తోంది. టివి9 రవిప్రకాష్‌తో సహా చాలా మంది ఎల్లో మీడియా అధినేతలతో శివాజీది మామూలు సాన్నిహిత్యం కాదు. సినిమా తారల సిత్రాలన్నింటినీ పచ్చ మీడియా జనాలకు, ఎల్లో పార్టీ జనాలకు చేరవేసిన చరిత్ర శివాజీది. అయితే గరుడ పురాణం తర్వాత మాత్రం నేను ఏ పార్టీకి సన్నిహితుడిని కాదు అంటూ కథలు వినిపించాడు. అదేంటంటే నేను చంద్రబాబును కూడా విమర్శించాను కదా అని కబుర్లు చెప్పాడు. చంద్రబాబు మనుషులు అయిన నాయకులు, ఎల్లో మీడియా జనాలు అందరూ చేసేది అదే కదా. వైఎస్ జగన్ అయితే సాక్షి అని చెప్పి సొంత మీడియా సంస్థ పెట్టుకున్నాడు. ఏం చేసినా స్ట్రెయిట్‌గా చేయడం జగన్ స్టైల్.

అదే చంద్రబాబువి మాత్రం అన్నీ వెన్నుపోటు వ్యవహారాలు……వెనక నుంచి నడిపించే కథలే. అలా ఇప్పటికే లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, సబ్బం హరిలాంటి నాయకులు ఉన్నారు. ఇక మీడియా సంస్థలు అయితే చెప్పనవసరం లేదు. అయితే భండారం బయట పడేవరకూ అందరూ ప్రజలను ఉద్ధరించేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళుగా కలరింగ్ ఇస్తూ ఉంటారు. ఒక సారి దొరికిపోయాక మాత్రం చంద్రబాబును సమర్థిస్తే తప్పేముంది? ఆయనకంటే అనుభవం ఎవరికి ఉంది అని దబాయిస్తారు. ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబుది కూడా అదే స్టైల్. ఇప్పుడు శివాజీ కూడా పూర్తిగా బయటపడిపోయాడు. టిటిడి ఛైర్మన్ అవ్వాలన్న తన కలను నేర్చేదేవుడిగా చంద్రబాబును చూసుకుంటున్నట్టు ఉన్నాడు శివాజీ. స్వయంగా శివాజీనే ఆ విషయం చెప్పుకొస్తున్నాడు. టిటిడి ఛైర్మన్ పదవి అంటే చెప్పేదేముంది……..కోట్లాది రూపాయల సంపాదన అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే మనవాడు ఏకంగా టిటిడి ఛైర్మన్ పదవిపై కన్నేశాడు. ఎమ్మెల్యే, ఎంపి అంటే ప్రజల మెప్పు పొందాలి, చాలా తతంగం ఉంటుంది కానీ టిటిడి ఛైర్మన్ పదవి అంటే చంద్రబాబులాంటి అధికారంలో ఉన్న నాయకుడి కోసం ఆపరేషన్ గరుడ అనో, ఇంకోటి అనో ఏవో రాజకీయాలు చేస్తూ ఉంటే చాలు.

అయితే ఇక్కడ వచ్చిన చిక్కంతా ఒక్కటే. టిటిడి ఛైర్మన్ అవ్వడమే జీవితాశయం…….చంద్రబాబు అన్ని కోరికలు తీర్చేస్తాడు. టిటిడి కూడా గొప్పగా అయిపోతుంది లాంటి మాటలు చెప్తూనే……….ఏం చేసినా అంతా ప్రజల కోసమే….ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలయినా ఇస్తా……లాంటి కామెడీ డైలాగులు కూడా చెప్తూ ఉండడం……….ఎంతైనా కామెడీని బాగా పండించే నటుడు కదా. అయితే స్వయంగా పచ్చ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూనే చంద్రబాబు మనిషినని చెప్పి బయటపడిపోవడం, టిటిడి ఛైర్మన్‌గిరీ అంటూ అసలు గుట్టు బయటపెట్టుకోవడంతో ఇక ముందు ఈ శివాజీ గరుడ పురాణాలు, ఆయన చెప్పే కథలు కొంతమంది ప్రజలు అయినా నమ్ముతారా అన్నది చూడాలి. ఇప్పటికే బాబు మనిషిగా చాలా మందికి అనుమానం. ఇక ఇప్పుడు స్వయంగా శివాజీనే ఒప్పుకున్న నేపథ్యంలో ఎన్నికల సమయం వరకూ గరుడ పురాణాలను వినిపించడానికి మరో కొత్త ‘శివాజీ’లాంటి కామెడీ నాయకుడిని వెతకాల్సిన పనిలో చంద్రబాబు పడ్డాడని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. జగన్‌పై హత్యాయత్నం పుణ్యమాని ఆపరేషన్ గరుడ వెనకాల కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ చంద్రబాబువేనని, తెరముందు నటిస్తున్నది మాత్రం శివాజీ అని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జనాలకు క్లారిటీ వచ్చింది. అవన్నీ నిజాలే అని ఇప్పుడు స్వయంగా శివాజీనే ఒప్పుకున్నట్టవ్వడం మాత్రం వైకాపా శ్రేణులకు ఆనందం కలిగించే విషయమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -