Sunday, April 28, 2024
- Advertisement -

హైద‌రాబాద్ రోడ్ల‌పై హ‌ల్‌చ‌ల్ చేస్తున్నా య‌ముడు, చిత్ర‌గుప్తుడు

- Advertisement -

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. న‌గ‌రంలో వాహ‌నాలు పెరిగిపోవ‌డం అంతే రీతిలో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. వాహ‌న‌దారుల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వినూత్న‌రీతిలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు స్వ‌చ్ఛంద సంస్థ‌లు.

హెల్మెట్ పెట్టుకోకపోతే కలిగే నష్టాలు, ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేస్తే యమలోకానికి వెళతారంటూ హెచ్చరిస్తూ… అందరిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ మియాపూర్ ఆధ్వర్యంలో బకుల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ స్పెషల్‌ ట్రాఫిక్‌ సెఫ్టీ పేరుతో… మియాపూర్‌తో పాటూ మరికొన్ని ప్రాంతాల్లోని సిగ్నల్స్ దగ్గర అవగాహాన కల్పించారు.

రోడ్లపైకి ఉన్నట్టుండి ఇలా యమడు, చిత్రగుప్తులు యమ భటులతో ప్రత్యక్షమయ్యారు. ఈ వేషాలు చూసి ముందు షాకైన వాహనదారులు… తర్వాత అసలు విషయం తెలుసుకొని నవ్వుకున్నారు.హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఎక్కువమంది ప్రాణాలు పోతున్నాయని… అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఇలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇలా కళాకారులతో ప్రదర్శన నిర్వహిస్తే… కొంతమందిలోనైనా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రోటరీ క్లబ్ ఆఫ్ మియాపూర్ ప్ర‌తినిధులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -