Sunday, April 28, 2024
- Advertisement -

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు క్రికెట‌ర్‌…

- Advertisement -

ప్ర‌ముఖ క్రికెటర్, తెలుగు బిడ్డ అంబటి రాయుడు అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఈ రోజు ప్రకటించాడు. ఈ మేరకు బీసీసీఐకి మెయిల్ ద్వారా తన రిటైర్మెంట్‌ను తెలియజేశాడు. స్టాండ్ బైగా ఉన్న రాయుడికి ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు క‌ల్పించ‌కుండా మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడం, తనను త్రీడీ ఆటగాడిగా అభివర్ణించడంపై మనస్తాపం చెందిన అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తనను కాకుండా విజయ్ శంకర్ అనే ఆటగాడిని టోర్నీకి ఎంపిక చేయడంతో ‘ఈ ప్రపంచకప్ చూసేందుకు త్రీడీ కళ్లద్దాలు కొన్నా’ అని రాయుడు వ్యాఖ్యానించాడు. దీంతో ఈ కామెంట్లను బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది. దీంతో రాయుడికి అవ‌కాశం ఇవ్వ‌కుండా ఒక్క వ‌న్డే మ్యాచ్ ఆడ‌ని మ‌యాంక్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా బీసీసీఐ పెద్దలు స్పందిస్తూ.. రాయుడు త్రీడీ ప్లేయర్ అనీ, అందుకే అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదని పరోక్షంగా విమర్శించారు. దీంతో తీవ్ర మ‌నస్థాపానాకి గుర‌యిన రాయుడు ఈ నిర్ణ‌యం తీసుక‌న్న‌ట్లు తెలుస్తోంది.

2001-02లో రంజీ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2005-06 రంజీ సీజన్ లో ఏపీ తరఫున ఆడాడు. 2003-04 అండర్ 19 ప్రపంచకప్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2015 ప్రపంచకప్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ 55 వన్డేలు ఆడిన రాయుడు 47.06 సగటుతో 1694 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 124 స్కోర్ నమోదుచేశాడు. ఇక ఐపీఎల్ లో 147 మ్యాచ్ లు ఆడిన రాయుడు 3,300 పరుగులు చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -